LPG Cylinder Prices Hiked: ఊహించినట్లుగానే సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఆయిల్ కంపెనీలు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25.50 మేర పెరిగింది. దీంతో వంటగ్యాస్ వినియోగించేవారిపై ధరలు నేరుగా ప్రభావం చూపనున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలపై నిర్ణయం తీసుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో జులై నెలకుగానూ నేడు రూ.25.50 మేర ధర పెరిగింది. ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.809 నుంచి రూ.834.50కు చేరింది. తాజాగా పెరిగిన ధరతో హైదరాబాద్‌లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.887 అయింది. జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరలు (LPG Cylinder Price) హైదరాబాద్‌ను మించిపోయాయి. ఓ వైపు పెట్రోమంట మండుతుంటే మరోవైపు ఎల్పీజీ ధరలు సామాన్యులను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఓవరాల్‌గా 2021లో మొత్తం రూ.140.50 పెంచారు.


Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే 


చివరగా ఏప్రిల్ నెలలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సవరించారు. మే, జూన్ నెలలో మాత్రం వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్ప ఊరట కలిగింది. తాజాగా ముంబైలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.834.50, కోల్‌కతాలో రూ.835.50 నుంచి రూ.861కు చేరుకుంది. చెన్నైలో నేటి నుంచి రూ.850.50కి ఎల్పీజీ సిలిండర్ విక్రయాలు జరుగుతున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook