LPG Gas Cylinder Booking Will Be Free By Using Paytm App: ఇప్పుడు హెచ్‌పీ(HP), ఇండేన్(Indane), భారత్ గ్యాస్(Bharat Gas) కంపెనీకి చెందిన ఎల్‌పీజీ సిలిండర్లు (LPG Cylinder) ఉచితంగా కొనడానికి ఒక్కరోజు మాత్రమే ఉంది. నేటిలో పేటీఎం క్యాష్ బ్యాక్, ఫ్రీ సిలిండర్ ఆఫర్ ముగియనుంది. మీరు ఇంకా Paytm యొక్క కొత్త పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ఇక ఆలస్యం చేయవద్దు. ఈ వివరాలు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Paytm క్యాష్‌బ్యాక్ ఆఫర్
పేటీఎం కొత్త పథకం కింద ఎల్‌పీజీ(LPG Latest Updates) సిలిండర్ల బుకింగ్‌పై రూ .700 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్(Cashback Offer) అందిస్తోంది. మీ ఎల్‌పీజీ సిలిండర్ ఖచ్చితంగా ఉచితంగా లభించనుంది.  ఎందుకంటే రీఫిల్ సిలిండర్ ధర రూ.700-750 రూపాయలు సబ్సిడీ మీకు అందిస్తోంది.


Also Read: Web WhatsApp Login: త్వరలో సరికొత్త WhatsApp Privacy ఫీచర్, 2 విధాలుగా వెబ్ లాగిన్



ఆఫర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి
మీరు LPG గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసినప్పుడు  మీరు యాప్‌లోనే స్క్రాచ్ కార్డ్ పొందుతారు. HP, Indane, భారత్ గ్యాస్ నుండి గ్యాస్ బుకింగ్ సమయంలో ఈ స్క్రాచ్ కార్డ్ ఉపయోగించవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ 24 గంటల్లో Paytm Walletలో మీకు అందుతుంది.



గ్యాస్ బుకింగ్ ఆఫర్ వ్యాలిడిటీ
ఈ ఆఫర్ పొందాలంటే..  మీరు కనీసం రూ.500 కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తూ బుకింగ్ జరపాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 31 వరకు (నేటితో) మాత్రమే కల్పించారు. తొలిసారి సిలిండర్ బుక్ చేస్తున్న వారు ఈ ప్రయోజనాన్ని పొందుతారు.


Also Read: New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్



ఎవరికి ప్రయోజనం
పేటీఎం యాప్(Paytm App) ద్వారా తొలిసారిగా ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకుంటున్న వినియోగదారులకు ఈ పథకం వర్తించనుంది. తద్వారా పేటీఎంలో తొలి సిలిండర్ బుక్ చేసుకునే వారు ప్రయోజనాన్ని పొందుతారు. అయితే IVRS లేదా ఇతర పద్ధతుల ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకునేవారికి కూడా లభిస్తుంది. కానీ Paytm యాప్ ద్వారా తొలి చెల్లింపు అయితే మీకు సిలిండర్ ధర ఉచితంగా లభించినట్లు చెప్పవచ్చు.


స్క్రాచ్ కార్డ్ గడువు
స్క్రాచ్ కార్డ్ పొందిన తరువాత 7 రోజులకే దాని గడువు ముగుస్తుంది. కనుక ఏదైనా బహుమతిని గెలుచుకోవటానికి వారం రోజుల వ్యవధిలో దాన్ని ఉపయోగించాలని పేటీఎం సంస్థ సూచించింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook