LPG Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో సబ్సిడీ పెంపు..?
LPG Gas Cylinder Price Today: గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రూ.200 నుంచి రూ.300 వరకు పెంచగా.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
LPG Gas Cylinder Price Today: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్‌పీజీ సిలిండర్ ధరలను భారీగా తగ్గించిన కేంద్రం.. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని పెంచే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సబ్సిడీ మొత్తాన్ని పెంచితే.. కోట్లాది మంది గ్యాస్ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
ఉజ్వల పథకం ప్రయోజనాలను వీలైనన్ని ఎక్కువ కుటుంబాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీని పెంచి.. గ్యాస్ వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.02 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం రేటును 4 నుంచి 6 శాతం రేంజ్‌లో ఉంచాలని ప్రభుత్వం ఆర్‌బీఐకి లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు జూలైలో ద్రవ్యోల్బణం 15 నెలల రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
కాగా.. ప్రస్తుతం ఉజ్వల పథకం లబ్ధిదారులు ఏడాదికి 12 సిలిండర్‌లను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని వినియోగదారులకు అందిస్తోంది. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర 903 రూపాయలుగా ఉంది. ఇందులో రూ.300 సబ్సిడీని తీసేస్తే.. లబ్ధిదారులు రూ.603కే గ్యాస్ సిలిండర్ అందుతోంది. ఇటీవల గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడంతోపాటు.. అల్పాదాయ కుటుంబాలకు ఎల్‌పీజీ సబ్సిడీని సిలిండర్‌పై రూ.200 నుంచి రూ.300కి పెంచిన విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా ఉజ్వల పథకం కనెక్షన్లను మరిన్ని పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఉజ్వల పథకం విస్తరణ కింద 75 లక్షల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లను ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10 కోట్లు దాటనుంది. అక్టోబర్‌లో సబ్సిడీ మొత్తాన్ని రూ.100 పెంచడంతో లబ్ధిదారులు గతంలో 14.2 కిలోల సిలిండర్‌కు సబ్సిడీ తర్వాత రూ.703 చెల్లించాల్సి ఉండగా.. ప్రస్తుతం 603 రూపాయలకు లభిస్తోంది. ఈ సబ్సిడీని మరింత పెంచితే.. ఇంకా తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ లభించనుంది.
Also Read: World Cup 2023 Semifinal Teams: పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ 4వ సెమీస్ ఎవరిది
Also Read: NBK109: గొడ్డలికి కళ్ళజోడు.. మన బాలయ్య కు మరో బ్లాక్ బస్టర్ షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి