Commercial LPG Gas Cylinder Prices Cut: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇటీవల గృహ వినియోగ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించగా.. తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి చమురు సంస్థలు. వరుసగా మరో నెలలో భారీగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం విశేషం. తాజాగా రూ.157.50 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1680 నుంచి రూ.1522కు చేరింది. తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. డొమస్టిక్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రూ.200 తగ్గించిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకుముందు ఆగస్టులో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను ఓఎంసీలు రూ.99.75 తగ్గించాయి. జూలైలో రూ.7 చొప్పున పెంచగా.. మే, జూన్‌లో వరుసగా రెండుసార్లు తగ్గించింది. మేలో ఓఎంసీలు కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.172 తగ్గించగా.. జూన్‌లో రూ.83 తగ్గించాయి. 


తాజాగా రూ.157.50 తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,522కు చేరింది. కోల్‌కతాలో రూ.1802.50 నుంచి రూ.1636కు చేరింది. ముంబైలో గతంలో రూ.1640.50 ఉండగా ప్రస్తుతం 1482 రూపాయలకు లభించనుంది. చెన్నైలో 1695 రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో 1,753 రూపాలయకు అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దేశీయ ఎల్‌పీజీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. 


ఇటీవల మహిళలకు రాఖీ పౌర్ణమి కానుకగా డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించింది. ఉజ్వల లబ్ధిదారులకు ఇప్పటికే రూ.200 తగ్గింపు ధరకు అందుతోంది. కేంద్రం నిర్ణయంతో వారికి రూ.400 తగ్గింపు వర్తిస్తుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్నింటిపై భారీగా ధరలు తగ్గిస్తోంది. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా భారీగా దిగివచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.  


Also Read: Kushi Twitter Review: ఖుషి మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఇదే..!  


Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook