మార్చ్ నెల మొదటిరోజు వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు బ్యాడ్ న్యూస్ విన్పించాయి. అటు ఆయిల్ కంపెనీలు కాస్త ఉపశమనం కల్గిస్తున్నాయి. పెట్రోల్-డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గనుండగా, గ్యాస్ ధర మాత్రం అమాంతం పెరిగిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చ్ 1 నుంచి కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ రెండింటి ధరలు పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. మరోవైపు పెట్రోల్-డీజిల్ ధరల్ని స్వల్పంగా తగ్గించాయి. వాస్తవానికి గత 9 నెలల్నించి ఏవిధమైన పెరుగుదల లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ దాదాపు 90 డాలర్లు పలుకుతోంది. అయితే గ్యాస్ ధర భారీగా పెరగడంతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. 


జనవరి 1 నుంచి 25 రూపాయలు పెంపు


గత కొద్దికాలంగా స్థిరంగా ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఇప్పుడు పెరిగాయి. మార్చ్ 1 అంటే ఇవాల్టి నుంచి గ్యాస్ సిలెండర్ ధర ఏకంగా 30.50 రూపాయలు పెరిగిపోయింది. అయితే ఇది 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర ఒకేసారి 350 రూపాయలు పెరగడంతో 1769 రూపాయల్నించి 2119.50 రూపాయలకు చేరుకుంది సిలెండర్ ధర. ఇంతకుముందు జనవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 25 రూపాయలు పెరిగింది. 


80 డాలర్లకు చేరుకున్న క్రూడ్ ఆయిల్


ఇటీవల క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు దాదాపు 80 డాలర్లు పలుకుతోంది. బుధవారం ఉదయానికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 83.89 డాలర్లకు చేరుకుంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ 77.30 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ -డీజిల్ ధరలు ఇంకా అలానే స్థిరంగా ఉన్నాయి. మార్చ్ 1 అంటే ఇవాళ్టి నుంచి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96.72 రూపాయలు కాగా డీజిల్ లీటర్ ధర 89.62 రూపాయలుంది.


ఇక డొమెస్టిక్ గ్యాస్ థర సిలెండర్ ఒక్కొక్కటి 50 రూపాయలు పెరిగింది. ఇప్పటి వరకూ డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర 1053 రూపాయలు కాగా ఇక నుంచి 1103 రూపాయలైంది. అదే సమయంలో ఏటీఎఫ్ ధరలు కూడా తగ్గాయి. ఏటీఎఫ్ ధర బ్యారెల్‌కు 4606 రూపాయలు తగ్గింది. ఫలితంగా ఫ్లైట్ ఛార్జెస్ తగ్గవచ్చు. ఫిబ్రవరి 1 న ఢిల్లీలో ఏటీఎఫ్ బ్యారెల్ ధర 1,12,356.77 రూపాయలు కాగా, కోల్‌కతాలో 1,19,239.96 రూపాయలుంది. ముంబైలో 1,11,246.61 రూపాయలు కాగా, చెన్నైలో 1,16,922.56 రూపాయలుంది. ఇప్పుడీ ధరల్లో బ్యారెల్‌కు 4606 రూపాయలు తగ్గుదల నమోదైంది.


Also read: Lost your PAN card?: మీ పాన్ కార్డు పోయిందా ? ఇలా చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook