Lulu Group: యూఏఈకు చెందిన ప్రసిద్ధ లూలూ గ్రూప్ ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. వచ్చే మూడేళ్ల వ్యవధిలో భారత్‌లో 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారాన్ని విసృత్తం చేస్తోంది. వచ్చే కొద్దినెలల్లో వ్యాపారాన్ని మరింత పెంచనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూఏఈకు చెందిన లూలు గ్రూప్ ఇప్పటికే ఇండియాలో షాపింగ్ మాల్స్, హోటల్స్, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు సహా వివిధ రంగాల్లో 20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. రానున్న మూడేళ్ల వ్యవధిలో ఈ పెట్టుబడుల్ని మరింత పెంచనున్నామని లూలు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. ఇప్పటికే ఉన్న రంగాల్లో మరో 10 వేల కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టనున్నామన్నారు. ఇండియాలో తమ వ్యాపారాల ద్వారా 50 వేల మందికి ఉపాధి కల్పించడం లూలు గ్రూప్ లక్ష్యమన్నారు యూసుఫ్ అలీ. ఇప్పటి వరకూ  వివిధ రంగాల్లో కలిపి దేశంలో 22 వేలమందికి ఉద్యోగాలిచ్చామని రానున్న మూడేళ్లలో మరో 28 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 


లూలు గ్రూప్ రానున్న ఐదేళ్ల వ్యవధిలో తెలంగాణలో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ సహా వివిధ కార్యక్రమాలకై దాదాపు 3500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని లూలు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ వెల్లడించారు. ఇప్పటికే షాపింగ్ మాల్, హోటల్, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాల్లో పెట్టిన 20 వేల కోట్ల పెట్టుబడుల్ని మరింత పెంచుతామన్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో షాపింగ్ మాల్ నిర్మాణం ప్రారంభించామని, చెన్నైలో కూడా షాపింగ్ మాల్ నిర్మిస్తున్నామన్నారు. ఇక ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ ఒకటి నోయిడాలో, రెండవది తెలంగాణలో స్థాపించనున్నామన్నారు. అన్నింటిపై కలిపి రానున్న మూడేళ్లలో 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 


Also read: July 2023 Changes: జూలై 1 నుంచి ఏయే అంశాల్లో మార్పులుంటాయి, గ్యాస్ ధర తగ్గనుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook