Madhabi Puri Buch Appointed First Woman Chairperson Of SEBI: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్‌పర్సన్‌గా మాధబి పూరీ బుచ్‌ను (Madhabi Puri Buch) కేంద్రం నియమించింది. సెబీ (SEBI) ఛైర్మన్‌గా తొలిసారి ఓ మహిళకు అవకాశం దక్కింది. ప్రస్తుత ఛైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగియడంతో ఆయన స్థానంలో ఈమె బాధ్యతలు చేపట్టనున్నారు. 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే మధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు ఎండీగా, సీఈవోగా కీలక బాధ్యతలు చేపట్టారు మాధబి పూరీ. ఈమె సెబీలో 2017-2021 మధ్య హోల్ టైమ్ మెంబర్‌గా పనిచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెబీ ఛైర్మన్‌గా మార్చి 1, 2017న బాధ్యతలు చేపట్టారు అజయ్ త్యాగి. కొవిడ్ దృష్ట్యా  2020 ఫిబ్రవ‌రిలో మెుదట ఆరు నెల‌లు, ఆగ‌స్టులో 18 నెల‌ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. 2021 అక్టోబర్‌లో సెబీ చైర్‌పర్సన్ పదవికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 6, 2021గా నిర్ణయించింది. 


క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్‌మెంట్స్ సెర్చ్ కమిటీ (FSRASC) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శితో పాటు మరో ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ఇంటర్వ్యూ చేస్తోంది. ఫైనల్ పేరును ప్రధానమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీకి FSRASC సిఫార్సు చేస్తుంది.


Also Read: Bharti Airtel Shares: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఎయిర్​టెల్ షేర్లు డీలా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook