Diwali Bonus 2024: మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం లడ్కీ బహిన్ యోజన కింద దీపావళి బోనస్ 2024ని ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం, లడ్కీ బహిన్ యోజన దీపావళి బోనస్ 2024 ద్వారా అర్హత కలిగిన మహిళలకు నాల్గవ, ఐదవ వాయిదాలు చెల్లిస్తుంది. దీని కింద మహిళా లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో రూ.3వేలు అందుతాయి. లడ్కీ బహిన్ యోజన  అక్టోబర్, నవంబర్ వాయిదాలను మహారాష్ట్ర ప్రభుత్వం దీపావళి బోనస్‌గా ముందుగానే విడుదల చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలోని 94,000 మందికి పైగా మహిళా లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల్లో ఈ  నగదు ఇప్పటికే జమ అయ్యింది. దీపావళి బోనస్ ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సాయంతో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీపావళి పండగను 
సంతోషంగా జరుపుకోనున్నారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మాఝీ లడ్కీ బహిన్ యోజన  నాల్గవ, ఐదవ విడతను కూడా సమయానికి ముందే విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో అక్టోబర్‌లో మహిళలకు సాధారణ రూ.1500 బదులు రూ.3000 లభించనుంది. దీపావళి బోనస్ లడ్కీ బహిన్ యోజన కోసం నమోదు చేసుకున్న.. అంతకుముందు వాయిదాలు పొందిన మహిళల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ అవుతుంది. 


ఏంటీ ప్లాన్? 


 లడ్కీ బహిన్ యోజనను సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనలో ఇప్పటికే అమలు చేసిన 'లాడ్లీ బ్రాహ్మణ యోజన' తరహాలో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రక్షాబంధన్ సందర్భంగా ప్రారంభించిన ఈ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ మహారాష్ట్ర అనుబంధ బడ్జెట్‌లో చేర్చారు.


వార్షిక వ్యయం రూ. 46,000 కోట్లు:


ఈ పథకానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.46,000 కోట్ల వార్షిక కేటాయింపులు అవసరమవుతాయని అంచనా. 21 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం. దీని కింద వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న వారికి ప్రభుత్వం ద్వారా ప్రతినెలా ఆర్థిక సహాయం అందజేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన లేదా పరిమిత ఆదాయంతో నివసిస్తున్న విభిన్న మహిళలకు ప్రత్యేకంగా అందించడం ఈ పథకం లక్ష్యం.


పథకం నిబంధనలు:


ఈ పథకం మహారాష్ట్ర రాష్ట్రంలోని మహిళా నివాసితులకు మాత్రమే వర్తిస్తుంది. దరఖాస్తుదారులు మహారాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇది కాకుండా, దరఖాస్తు చేసుకునే మహిళ వయస్సు 21 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. వివాహితులు, అవివాహితులు, ఒంటరి మహిళలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారు మహిళ ఏదైనా బ్యాంకులో తన స్వంత పేరుతో బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. దరఖాస్తుదారు మహిళ కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షలకు మించకుండా  ఉండాలి. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter