Mahindra Atom Price: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పెద్ద ఆటోమేకర్లతో పాటు స్టార్టప్‌లు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా ఎలక్ట్రిక్ ఆటోమ్ క్వాడ్రిసైకిల్‌ను ట్రియో ఆటో, ట్రియో జోర్ డెలివరీ వాన్, ట్రియో టిప్పర్ వేరియంట్, ఇ-ఆల్ఫా మినీ టిప్పర్‌తో పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ 3-వీలర్ సెగ్మెంట్లో 73.4 శాతం మార్కెట్ వాటాను మహీంద్రా కంపెనీ కలిగి ఉండడం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహీంద్రా ఆటమ్ EV విడుదల..


K1, K2, K3. K4 అనే నాలుగు వేరియంట్లలో మహీంద్రా ఆటమ్ (EV) విడుదల కానుంది. మొదటి రెండు వేరియంట్‌లు 7.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. కానీ మిగిలిన వేరియంట్స్ రెండు శక్తివంతమైన 11.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. Atom K1, K3 వేరియంట్స్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో రావు. కానీ.. K2, K4 వేరియంట్స్ లో మాత్రం ఎయిర్ కండిషనర్ సదుపాయం ఉంటుంది. కంపెనీ త్వరలో భారత మార్కెట్‌లో ఆటమ్ క్వాడ్రిసైకిల్స్‌ను విడుదల చేయనుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.


మహీంద్రా ఆటమ్ క్వాడ్రిసైకిల్స్..


ఎలక్ట్రిక్ పవర్ తో నడువనున్న మహీంద్రా ఆటమ్ సౌకర్యవంతమైన, స్మార్ట్ ఫీచర్లతో క్లీన్ ఎనర్జీతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆటమ్‌తో పాటు, మహీంద్రా ఇ-ఆల్ఫా మినీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఎలక్ట్రిక్ ఆల్ఫా టిప్పర్‌ను పరిచయం చేసింది. ఇ-ఆల్ఫా మినీ టిప్పర్ 1.5 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీల వరకు నడువగలదు. దీని లోడింగ్ కెపాసిటీ 310 కిలోలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎప్పుడు మార్కెట్లోకి విడుదల కానుందనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. 


రూ. 3 లక్షలు మాత్రమే!


మహీంద్రా ఆటమ్ డిజైన్, ఫీచర్ల పరంగా పైసా వసూల్ కారుగా చెప్పవచ్చు. దీని ధర చాలా తక్కువగా మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3 లక్షలు. ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహీంద్రా ఆటమ్ గరిష్ట వేగం గంటకు 50 కి.మీ. గా ఉంటుంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ. వరకు నడుస్తుంది.  


Also Read: Amazon Samsung M12: రూ.549 ధరకే శాంసంగ్ గెలాక్సీ మొబైల్ అందుబాటులో!


Also Read: Budget Smartphones: హై ఫీచర్స్, ధర రూ.6 వేల కంటే తక్కువకే అందుబాటులో ఉన్న మొబైల్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.