Mahindra XUV 3XO: మార్కెట్‌లో ఇప్పటికే క్రేజ్ సంపాదించుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కు అప్‌డేటెడ్ వెర్షన్  Mahindra XUV 3XO. ఏప్రిల్ 29న భారత మార్కెట్‌లో లాంచ్ కానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పీచర్లు, డిజైన్ గురించి మహీంద్రా కంపెనీ స్వయంగా టీజ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mahindra XUV 3XO ప్యాన్ పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి  ఉండటంతో మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఇన్‌ఫో‌టైన్‌మెంట్ సిస్టమ్ బాగుంటుంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఏసీ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ వీల్, అప్‌‌డేటెడ్ డ్యాష్ బోర్డ్ లే అవుట్ వంటి లక్షణాలు ప్రత్యేకంగా ఉండి మహీంద్రా ఎక్స్‌యూవీ 400 లా ఉండవచ్చు. ఇందులో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేటెండ్ ఫ్రంట్ సీట్స్, ఏంబియెంట్ లైటింగ్, 360 డిగ్రీ సరౌండ్ కెమేరా, వైర్‌లెస్ ఛార్జర్ వంటి అదనపు సౌకర్యాలుంటాయి. 


ఇక Mahindra XUV 3XO ఇంజన్ గురించి పరిశీలిస్తే ఇందులో 1.2 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వంటి ఫీచర్లు ఉంటాయి. మరోవైపు 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉండటం గమనార్హం. ఈ కారు డ్యాష్‌బోర్డ్ కూడా చాలా అప్‌డేటెడ్ వెర్షన్‌తో చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుంది. 


మార్కెట్‌లో ఇది టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుండయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నెట్, రెనో కైగర్‌తో పోటీ పడుతుంది. Mahindra XUV 3XO ఈ నెల 29న లాంచ్ కానుండగా త్వరలో మహీంద్రా ఎస్‌యూవీ ఈవీ వెర్షన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికి ఇది లాంచ్ కావచ్చు. 


Also read: Bajaj Chetak EV 2024: పాత మోడల్‌లోనే కొత్త బజాజ్ చేతక్ 2024 రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook