Mahindra Thar 5 Door Launch Date in India: ఎస్‌యూవీ కార్ మార్కెట్‌లో మహీంద్రా కంపెనీ మారుతి, టాటా వంటి ఇతర స్వదేశీ కంపెనీలతో పోటీ పడుతుంటుంది. ఈ విభాగంలో మహీంద్రా ఎక్స్‌యూవీ ఇప్పటికే ఉండగా ఇప్పుడు మరో కారును లాంచ్ చేస్తోంది మహీంద్రా కంపెనీ. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహీంద్రా థార్ ఎస్‌యూవీ గురించి తెలిసిందే. ఇందులో ఇప్పుడు 5 డోర్ వెర్షన్ లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధమౌతోంది. ఇప్పటికే టెస్టింగ్ పూర్తయింది. ఇప్పుడు లాంచ్ ఎప్పుడనేది కూడా తేలిపోయింది. మారుతి సుజుకికు చెందిన జిమ్నీకు పోటీగా మహీంద్రా థార్ ఎస్‌యూవీ 5 డోర్ వెర్షన్ ప్రవేశపెడుతోంది. ఎందుకంటే ఈ విభాగంలో మారుతి జిమ్ని ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మహీంద్రా థార్ 5 డోర్ ఎస్‌యూవీను ఆగస్టు 15న ప్రపంచమార్కెట్‌లో లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధమౌతంది. గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించనుంది. గతంలో కూడా మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 700తోపాటు వీటి ఎలక్ట్రిక్ వేరియంట్లను ఆగస్టు 15వ తేదీనే లాంచ్ చేసింది. 


మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ కూడా 3 డోర్ మోడల్ డిజైన్‌లానే ఉంటుంది. ఎస్‌యూవీలో వెర్టికల్ సెలెక్టెడ్ గ్రిల్, సర్క్యులర్ హెడ్‌ల్యాంప్, ఫెండర్ మౌంటెడ్ డీఆర్ఎల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ , ఎలక్ట్రికల్లీ ఎడ్జస్టబుల్ ఓఆర్వీఎమ్, బ్లాక్ క్లోడింగ్, ఫ్రేయర్డ్ వీల్ ఆర్చ్, 18 ఇంచెస్ ఎల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతేకాకుండా అద్భుతమైన ఇతర ఫీచర్లు మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ కారుని మారుతి సుజుకి జిమ్ని కంటే ముందుంచుతాయి.


మహీంద్రా థార్ 5 డోర్ ఇంటీరియల్ ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత వస్తోంది. ఇందులో ఆల్ బ్లాక్ డ్యాష్‌బోర్డ్, ఫేబ్రిక్ అప్ హోల్‌స్ట్రీ, యాంబియెంట్ లైటింగ్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టివిటీ ఆప్షన్, వాటర్ రెసిస్టెంట్ ఇన్‌ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌తో పాటు 5 సీటర్ కేబిన్ ఉంటాయి. ఇక సేఫ్టీపరంగా చూస్తే ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.


మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్‌లో కూడా 3 డోర్ వెర్షన్ ఇంజనే ఉంటుంది. ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 128 హెచ్‌పి పవర్, 300 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. అటు 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే 147.9 హెచ్‌పి పవర్, 320 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 4 వీల్ డ్రైవ్ ఈ కారు ప్రత్యేకత. దీంతోపాటు 6 స్పీడ్ మేన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటాయి. మార్కెట్‌లో ఈ కారుకు మారుతి సుజుకికు చెందిన జిమ్నీతో గట్టిగా ఉండవచ్చు.


Also Read: Top Export Cars: విదేశాల్లో హల్‌చల్ చేస్తున్న మారుతి సుజుకి చీప్ అండ్ బెస్ట్ కారు, ధర కేవలం 4 లక్షలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook