Mahindra Thar Price Hike 2023: మహీంద్రా థార్ కొనేవారికి షాక్.. ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన ధర!
Mahindra Thar price in India hiked by up to Rs 1 lakh. మహీంద్రా థార్ బీఎస్6 ఫేజ్-2 మరియు ఆర్డీఈ ఉద్గార నిబంధనల ప్రకారం నవీకరించబడింది. దాంతో థార్ ధరలు పెరిగాయి.
Mahindra Thar prices hiked in india by up to Rs 1 lakh: మహీంద్రా కంపెనీ తన థార్ ఎస్‌యూవీ శ్రేణి ధరలను పెంచింది. ఈ ఎస్‌యూవీ ధర 1.05 లక్షల వరకు పెరిగింది. వాస్తవానికి మహీంద్రా థార్ బీఎస్6 (BS6) ఫేజ్-2 మరియు ఆర్డీఈ (RDE) ఉద్గార నిబంధనల ప్రకారం నవీకరించబడింది. దాంతో మహీంద్రా థార్ ధరలు కూడా పెరిగాయి. ధరల పెంపు తర్వాత థార్ X (O) హార్డ్ టాప్ డీజిల్ MT RWD వెర్షన్ రూ. 55,000 పెరిగింది. అదేవిధంగా మహీంద్రా థార్ ఎల్‌ఎక్స్ హార్డ్ టాప్ డీజిల్ ఎమ్‌టి ఆర్‌డబ్ల్యుడి వెర్షన్ ఇప్పుడు రూ. 1.05 లక్షలు పెరిగింది. ఈ ఎస్‌యూవీలోని ఇతర మోడళ్ల ధర రూ. 28,000 పెరిగాయి.
మహీంద్రా థార్ ఎస్‌యూవీ (Mahindra Thar Price Hike 2023) యొక్క టాప్-స్పెక్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ డీజిల్ AT 4WD యొక్క కొత్త ధర రూ. 16.77 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. బేస్ వేరియంట్ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)లుగా ఉంది. మహీంద్రా థార్ ఎంట్రీ-లెవల్ వేరియంట్‌పై రూ. 55,000 పెరిగింది. దాంతో ఈ కారు ధర ప్రారంభ ధర మునుపటి కంటే చాలా ఎక్కువగా మారింది. అయితే మహీంద్రా థార్ యొక్క ప్రారంభ ధరలను తగ్గించడానికి కంపెనీ ఒక కొత్త వేరియంట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. అది AX (O) వేరియంట్ కంటే కొత్త బేస్-స్పెక్ వేరియంట్‌గా ఉండనుంది. ఈ కొత్త బేస్ వేరియంట్‌లో ఫీచర్లు ఇంకా తెలియరాలేదు.
మహీంద్రా థార్ రియర్-వీల్ డ్రైవ్ మరియు ఫ్రంట్-వీల్ డ్రైవ్ రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. రియర్-వీల్ డ్రైవ్ వెర్షన్ రెండు పవర్‌ట్రైన్ ఎంపికలతో వస్తుంది . 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ (150 PS, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్) పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ (115 PS, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్) డీజిల్ ఇంజన్ ఉంటుంది. దీని 4-వీల్ డ్రైవ్ వెర్షన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో కూడా అందుబాటులో ఉంది ( 2.0-లీటర్ (150 PS) టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ (130 PS) డీజిల్ ఇంజన్). ఈ రెండు పవర్‌ట్రెయిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తాయి.
Also Read: Gold Price Hike 2023: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర! ఆల్‌టైమ్ హై
Aslo Read: Tata Nexon 2023: ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఎస్‌యూవీ ఉండగా.. మారుతీ బ్రెజాను ఎందుకు కొనుగోలు చేయాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.