హిండెన్‌బర్గ్ నివేదికతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న అదానీ గ్రూప్‌కు మూడీస్ గ్రూప్ నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్ విలువ క్షీణించిన తరువాత అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు కంపెనీలకు నెగెటివ్ ర్యాంకింగ్ లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తరువాత అదానీ గ్రూప్ కంపెనీ విలువ భారీగా తగ్గిపోయింది. మూడీస్ నివేదికతో మరో ఇబ్బంది ఎదురైంది. అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు కంపెనీలకు మూడిస్ గ్రూప్ నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది. ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టెప్ వన్ లిమిటెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ ఉన్నాయి. 


100 డాలర్లు తగ్గిన మార్కెట్ క్యాప్ 


హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో అవినీతి, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, షేర్ల అవకతవకలపై ఆరోపణల అనంతరం అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ వాటా భారీగా తగ్గిపోయింది. మార్కెట్ వాటా క్షీణించడాన్ని పరిగణలో తీసుకుని ఆయా సంస్థలకు రేటింగ్ ఇచ్చామని మూడీస్ సంస్థ తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చిన తరువాత అదానీ గ్రూప్ మార్కెట్ వాటా 100 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. అదానీ గ్రూప్‌కు చెందిన 8 కంపెనీలకు రేటింగ్ ఇచ్చింది.


నాలుగు కంపెనీల రుణాలు పెరిగే అవకాశాల్లేవు


అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ రేటింగ్‌ను మూడీస్ సంస్థ స్థిరంగా ఉంచింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ గ్రూప్ విషయంలో ఏ మార్పు లేదు. నెగెటివ్ ర్యాంకింగ్ కారణంగా ఈ 4 కంపెనీలు భవిష్యత్‌లో రుణాలు పెంచుకునే అవకాశాల్లేవు.


Also read: Supreme Court: ఇన్వెస్టర్లకు ఎలా రక్షణ కల్పిస్తారు..అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook