Gas Cylinder Price: గ్యాస్ వినియోగదారుల నెత్తిన కేంద్ర ప్రభుత్వం మరోసారి సిలెండర్ భారాన్ని మోపుతోంది. ఇవాళ్టి నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఆయిల్ కంపెనీలు ఇవాళ్టి నుంచి సిలెండర ధరను పెంచేశాయి. సిలెండర్ ధర ఇవాళ్టి నుంచి ఎంత పెరుగుతుందనేది పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరను 2 వందల రూపాయలు తగ్గించి గ్యాస్ వినియోగదారులకు కాస్త ఉపశమనం కల్గించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్ని భారీగా పెంచేసింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను ఏకంగా 209 రూపాయలు పెంచింది. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దసరాకు ముందు ఇలా గ్యాస్ సిలెండర్ ధరను పెంచడం వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 209 రూపాయలు పెరగగా, కోల్‌కతాలో 203 రూపాయలు, ముంబైలో 202 రూపాయలు, చెన్నైలో 203 రూపాయలు పెరిగింది. 


గత నెలలో కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ సిలెండర్ ధరను 200 తగ్గించగా ఇప్పుడు కమర్షియల్ సిలెండర్ ధరను అంతే మేర పెంచి సరి చేసేసింది. అక్టోబర్ 1 నుంచి అంటే ఇవాళ్టి నుంచి కొత్త సిలెండర్ ధరలు అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 1522 రూపాయల్నించి 1731 రూపాయలకు చేరుకుంది. కోల్‌కతాలో 1839 రూపాయలు పలుకుతుండగా, ముంబైలో 1684 రూపాయలైంది. ఇక చెన్నైలో 1889 రూపాయలకు చేరింది. 


డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో 901 రూపాయలుండగా, కోల్‌కతాలో 945 రూపాయలుంది. ముంబైలో 926 రూపాయలుంది. చెన్నైలో 902 రూపాయలుంది. ఏదేమైనా పండుగ వేళ కమర్షియల్ సిలెండర్ ధర పెంచడం ప్రతికూల ప్రభావం చూపించనుంది.


Also read: Hero MotoCorp Two Wheelers: హీరో బైక్స్ కొనేవారికి షాకింగ్ న్యూస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook