Get Maruti Fronx Low Price: ప్రస్తుతం మార్కెట్లో ప్రముఖ ఆటో కంపెనీ మారుతికి సంబంధించిన కార్లకు ఉన్న డిమాండ్ అంతో ఇంతో కాదు.. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ 2023లో జరిగిన ఆటో ఎక్స్‌పో సందర్భంగా మారుతి తన మైక్రో SUV ఫ్రాంటెక్స్‌ను విడుదల చేసింది. ఈ విడుదలైన కొద్ది రోజుల్లోనే చాలా ప్రజాదారణ పొందింది. ఈ కార్ కి మంచి రెస్పాన్స్ లభించడంతో ఆర్డర్ చేసిన కొన్ని నెలల తర్వాత కంపెనీ డెలివరీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ SUV క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ CSDలో అందుబాటులో ఉంది. ఈ కారును దేశంలోని ఆర్మీ సిబ్బంది కొనుగోలు మారుతి GST లేకుండా విక్రయిస్తోంది. ఆర్మీ సిబ్బంది ఈ కారును కొనుగోలు చేసే క్రమంలో ఒక్క రూపాయి జీఎస్టీ చెల్లించకుండా పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. దీంతో ఈ కారుపై దాదాపు రూ. 112,450 వరకు తగ్గింపు లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం Frontex  మొత్తం 5 వేరియంట్‌లు CSDలో అందుబాటులో ఉంటాయి. ఇందులో సాధారణ, టర్బో ఇంజిన్‌లు రెండూ ఉన్నాయి. అలాగే  మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం మార్కెట్లో ఫారెక్స్ సిగ్మా వేరియంట్ ధర రూ. 746,500 (ఎక్స్-షోరూమ్) కాగా..CSDలో ఈ కారును రూ. 660,181కే పొందవచ్చు. అంటే ఈ వేరియంటుపై దాదాపు రూ.86,319 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక డెల్టా ప్లస్ వేరియంట్ విషయానికొస్తే.. ఈ వేరియంట్ ధర రూ. 927,500 కాగా..CSDలో రూ. 820,253కే పొందవచ్చు. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.


మారుతి ఫ్రాంటెక్స్ 1.0 లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్‌తో లభిస్తోంది. ఇది గంటకు 5.3-సెకన్లలో 0 నుంచి 60కిమీ వేగంతో ప్రయాణిస్తుందని మారుతి వెల్లడించింది. ఈ వేరియంట్లలో అధునాతన 1.2-లీటర్ K-సిరీస్, డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ కార్లన్నీ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో లభిస్తున్నాయి. ఈ ఇంజన్లు పాడిల్ షిఫ్టర్‌లతో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటాయి. ఇందులో ఆటో గేర్ షిఫ్ట్ ఆప్షన్ కూడా  ఉంది. ఇక మైలేజీ విషయానికొస్తే.. ఒక లీటర్ కు 22.89కిమీ వరకు ఇస్తాయి. దీంతోపాటు వీల్ బేస్ 2520ఎమ్ఎమ్, 308 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటాయి.



ఇతర ఫీచర్స్‌ వివరాలు:
❁ 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్
❁ హెడ్-అప్ డిస్‌ప్లే
❁ క్రూయిజ్ కంట్రోల్
❁ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్
❁ డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్
❁ వైర్‌లెస్ ఛార్జర్
❁ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
❁ 6-స్పీకర్ సౌండ్ సెటప్‌
❁ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
❁ వేగవంతమైన USB ఛార్జింగ్ పాయింట్
❁ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ 
❁ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter