Maruti Eeco: కేవలం 5.27 లక్షలకే 7 సీటర్ కారు, ఎర్టిగా, ఇన్నోవాలకు దెబ్బే
Maruti Eeco: మారుతి సుజుకి కంపెనీ కార్లకు ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే ప్రతి నెలా ఆ కంపెనీ కార్ల ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి. మారుతి సుజుకి కార్లకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇప్పుడు మరో కారు గట్టి పోటీ ఇస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Maruti Eeco: మారుతి సుజుకి ప్రస్తుతం దేశంలో నెంబర్ వన్ కార్ కంపెనీగా ఉంది. హ్యాచ్‌బ్యాక్ కారైనా లేదా ఎస్‌యూవీ అయినా సెగ్మెంట్ ఏదైనా సరే మారుతి కంపెనీ కార్లే అగ్రస్థానంలో ఉంటున్నాయి. ఏళ్ల తరబడి పాతుకుపోయిన నమ్మకం అలాంటిది. హ్యాచ్‌బ్యాక్ కార్లలోనే కాదు..7 సీటర్ సెగ్మెంట్ కూడా మారుతి కంపెనీ కార్లు గట్టి పోటీ ఇస్తున్నాయి.
మారుతి సుజుకి కంపెనీకు చెందిన మారుతి స్విఫ్ట్, వేగన్ ఆర్, బలేనో దేశంలోని టాప్ 3 బెస్ట్ సెల్లింగ్ కార్లుగా ఉన్నాయి. ఈ కార్లన్నీ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో టాప్ 3లో ఉన్నాయి. ఇక 7 సీటర్ల సెగ్మెంట్‌లో కూడా మారుతి ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. మారుతి ఎర్టిగా, మారుతి ఎక్స్ఎల్ 6 వంటి ప్రీమియం కార్లకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఈ సెగ్మెంట్‌లో మారుతి కంపెనీకు చెందిన ఓ కారు విక్రయాల్లో ఇతర కార్లను దాటేసింది. ఈ కారు ధర కూడా చాలా తక్కువ. కేవలం 5.27 లక్షలతో ప్రారంభం కానుంది.
మారుతి సుజుకి ఈకో కారు దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న 7 సీటర్ కార్లలో ఒకటి. విక్రయాల్లో మారుతికిచెందిన ఎర్టిగోను సైతం వెనక్కి నెట్టేసింది. మే నెలలో మారుతి సుజుకి ీకో 12, 818 యూనిట్లు అమ్మకాలు సాధించింది. ఇక గత మూడు నెలల అమ్మకాలు పరిశీలిస్తే మార్చ్ నెలలో 11,995 యూనిట్లు, ఏప్రిల్ నెలలో 10,504 యూనిట్లు, మే నెలలో 12,818 యూనిట్లు అమ్మకాలు నమోదు చేసింది. అటు మే నెలలో ఎర్టిగా కేవలం 10,528 యూనిట్లు విక్రయాలు జరిపింది.
మారుతి సుజుకి ఈకో అనేది ప్రైవేట్ మరియ కార్గో సెగ్మెంట్‌లో అమ్మకాలు చేస్తోంది. అంటే మల్టీపర్పస్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇది 7 సీటర్ కార్ మార్కెట్‌లో డెలివరీ వ్యాన్, స్కూల్ వ్యాన్, ఆంబులెన్స్ రూపంలో అధికంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఇంటీరియర్ స్పేస్ కూడా ఎక్కువ. కంపెనీ నుంచి వచ్చే అధికారికమైన సీఎన్జీ కిట్ ఉంటుంది. ఫలితంగా మైలేజ్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఈ కారు ధర 5.27 లక్షల నుంచి ప్రారంభమై 6.53 లక్షల వరకూ ఉంది. మారుతి సుజుకి ఈకోలో 1.2 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 81 పీఎస్ పవర్, 104.4 టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్‌తో పాటు అనుసంధానించారు.పెట్రోల్ వెర్షన్ అయితే లీటరుకు 19.71 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తే..సీఎన్జీ వెర్షన్‌లో 26.78 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
Also read: Kia Seltos: అద్భుతమైన ఫీచర్లతో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ త్వరలో, హ్యుండయ్ క్రెటా పరిస్థితి ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook