COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Suzuki Eeco 2024 Model Price: మీ ఫ్యామిలీ కోసం ప్రీమియం సెఫ్టీ ఫీచర్స్‌తో కూడిన 7 సీటర్‌ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అద్భతమైన డిజైన్‌తో త్వరలోను మారుతి సుజుకి తమ కొత్త ఎంతో పాపులర్‌ ఈకోను మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. అంతేకాకుండా గతంలో ఈ ఈకోకు సంబంధించి బ్లూ కలర్‌ కారుకు సంబంధించి ఫోటోస్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ కారు ఎంతో శక్తివంతమైన ఇంజన్‌ సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


మారుతి ఈకో కంపెనీ 2010 సంవత్సరంలో మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మకాల్లో దూసుకుపోయింది. అంతేకాకుండా ఇది అద్భుతమైన మైలేజీ సెటప్‌తో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది మిడిల్‌ క్లాస్‌ కస్టమర్స్‌ కూడా కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. అంతేకాకుండా కంపెనీ ఇప్పటి వరకు అనేక కొత్త కార్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసినప్పటికీ నేటికీ ఈకోకు డిమాండ్ తగ్గలేదు. అయితే దీనిని దృష్టలో పెట్టుకుని కంపెనీ మరో ముందడుగు వేసింది. అతి తక్కువ ధరలోనే ఈకోను ఆప్డేట్‌ వేరియంట్‌లో లాంచ్‌ చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ కార్ల తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. 


ఫీచర్స్‌:
కొత్త మారుతి ఈకోలో అద్భుతమైన డిజైన్‌తో అందుబాటలోకి రాబోతోంది. అంతేకాకుండా లోపలి భాగంలో ప్రత్యేకమైన స్పెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే చూడడానికి అద్భుతమైన బ్లూ కలర్‌ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో అనేక కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, డోమ్ ల్యాంప్, కొత్త బ్యాటరీ సేవింగ్  వంటి అనేక ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ లభిస్తున్నాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇంజన్‌ వివరాలు:
ఇక ఈకో కారు ఇంజన్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ప్రీమియం ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది ఎంతో ప్రత్యేకమైన  1.2 లీటర్ BS6 ఇంజన్‌ సెటప్‌తో లభిస్తోంది. ఇక ఈ ఇంజన్‌ 74 బిహెచ్‌పి పవర్, 98 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి  చేసే సామర్థ్యంతో లభిస్తోంది. కంపెనీ దీనిని మొత్తం రెండు ఇంజన్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో మొదటి వేరియంట్‌ పెట్రోల్‌ ఇంజన్‌ లీటరుకు 19.71 కిమీ మైలేజీ, సిఎన్‌జి వేరియంట్‌ కిలోకు 26.78 కిమీ మైలేజీని  ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ధర వివరాల్లోకి వెళితే ఇది రూ. 4 లక్షల నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి