Maruti Suzuki: మరోసారి ధరల్ని పెంచిన మారుతి సుజుకి, త్వరలో మారుతి ఈవీ కారు
Maruti Suzuki: మారుతి వాహన ప్రేమికులకు షాకింగ్ న్యూస్, మారుతి కంపెనీ కార్ల ధరలు పెంచేసింది. కంపెనీ అన్ని మోడల్ కార్ల ధరల్ని 1.1 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని దిగ్గజ కార్ల కంపెనీ మారుతి మరోసారి కార్ల ధరల్ని పెంచుతోంది. గత ఏడాది అంటే 2022 ఏప్రిల్ నెలలో ధరల్ని పెంచిన మారుతి ఈసారి.. మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి కార్ల ధరల్ని పెంచే విషయమై మారుతి కంపెనీ డిసెంబర్ నెలలోనే ప్రకటన చేసింది. ఇన్‌పుట్ ధరలు పెరుగుతుండటం, ఎమిషన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా కార్లను అప్‌గ్రేడ్ చేయడం కోసం కార్ల ధరల్ని పెంచనున్నట్టు వెల్లడించింది. దాదాపు అన్ని మోడల్ కార్లపై 1.1 శాతం పెంపు ఉండవచ్చని అంచనా. 2023 జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త ధరలు ఢిల్లీలోని ఎక్స్ షోరూం ధరల ఆధారంగా నిర్ణయించారు.
మారుతి కంపెనీ ఎంట్రీ లెవెల్ చిన్నకారైన ఆల్టో నుంచి ఎస్‌యూవీ గ్రాండ్ విటారా వరకూ వివిధ మోడల్ కార్ల విక్రయాలు జరుపుతోంది. ఈ కార్ల ధరలు ఢిల్లీ ఎక్స్ షోరూం ప్రకారం 3.39 లక్షల నుంచి 19.49 లక్షల వరకూ ఉండవచ్చు. మారుతి సుజుకి వేగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రిజా, సెలేరియో, బలేనో వంటి ఇతర మోడల్ కార్లను మారుతి ఉత్పత్తి చేస్తోంది. భారతీయ మార్కెట్‌లో 2022 ఆఖరుకు కంపెనీ విక్రయాల్లో క్షీణత కన్పించింది. మారుతి సుజుకి మొత్తం అమ్మకాలు డిసెంబర్ 2022 నాటికి 1,39, 347 వేల యూనిట్లతో 9 శాతం క్షీణత తగ్గింది.
మారుతి సుజుకి జిమ్మి 5 డోర్ వెర్షన్‌ను దేశంలో లాంచ్ చేసింది. ఫిబ్రవరి 2023 నాటికి కంపెనీ ఎస్‌యూవీ లాంచ్ చేయవచ్చు. మారుతి సుజుకి ఈవీఎక్స్ త్వరలో ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేస్తోంది.
Also read: Union Budget 2023: 8వ వేతన సంఘం ఉంటుందా లేదా, ఉద్యోగుల జీతం పెంపుపై కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook