Maruti Suzuki Jimny Vs Mahindra Thar: ఏ కారుకి ఎంత ధర, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ?
Maruti Suzuki Jimny Vs Mahindra Thar: మారుతి సుజుకి జిమ్నీ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే మహీంద్రా థార్‌కు గట్టి పోటీని ఇవ్వడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు SUV కార్ల కోసం ఆర్డర్ ఇస్తే.. ఏ కారుకి ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ తీసుకుంటోంది, దేనికి ఎక్కువ ధరలు ఉన్నాయి, వాటి ఇంజన్ ఫీచర్స్ ఏంటి అనే అంశాలను ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం రండి.
Maruti Suzuki Jimny Vs Mahindra Thar: ఇండియాలో SUV కార్ల కేటగిరీలో మహీంద్రా థార్ ఆధిపత్యం చెలాయిస్తుండగా.. తాజాగా థార్ ఆధిపత్యాన్ని ప్రశ్నార్ధకం చేస్తూ మారుతి సుజుకి జిమ్నీ లాంచ్ అయింది. ఈ రెండు SUV కార్లలో ఒకదానితో ఒకటి పోల్చుకునేందుకు పెద్దగా తేడా లేని అంశాలు ఎన్నో ఉన్నాయి. తిరుగులేని శక్తి, క్లాసిక్ డిజైన్, ఆకారం, ఇంజన్, వేగం.. ఇలా అనేక రకాల సాంకేతిక అంశాల పరంగానే కాకుండా చివరకు ఇండియాలో సప్లై కొరత కారణంగా వెయింటింగ్ పీరియడ్ విషయంలోనూ ఈ రెండు కార్లు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి.
మహింద్రా థార్ వెయిటింగ్ పీరియడ్
మహింద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ విషయానికొస్తే.. , మహీంద్రా థార్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయినప్పటి నుండి కూడా ఈ వాహనం కోసం చాలా కాలం పాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం చూస్తే, మహింద్రా థార్ 1.5-లీటర్ 2WD డీజిల్ వెర్షన్ SUV వాహనం 17 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ కింద వేచి ఉండాల్సి వస్తోంది. ఒకవేళ , 4WD వెర్షన్ కారుని ఎంచుకున్నట్టయితే, వెయిటింగ్ పీరియడ్ 16 నెలల వరకు ఉంటోంది. అంటే ఏ విధంగా చూసుకున్నా దాదాపు ఏడాదిన్నర ముందుగానే బుక్ చేసుకుంటేనే కారు ఇప్పటికీ డెలివరీ అయి ఉంటుందన్న మాట.
మహీంద్రా థార్ ధర
మహీంద్రా థార్ ధర విషయానికొస్తే.. మహీంద్రా థార్ ఎక్స్ - షోరూమ్ ధర రూ. 10.54 లక్షలు వద్ద మొదలై హై ఎండ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.77 లక్షల వరకు ఉంటుంది. మహీంద్రా థార్ 4WD వెర్షన్లు రెండు వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ ఇంజన్ కాగా మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజన్.
మారుతి సుజుకి జిమ్నీ వెయిటింగ్ పీరియడ్
మారుతి సుజుకి జిమ్నీ వెయిటింగ్ పీరియడ్ విషయానికొస్తే.. నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో వేదికగా ఈ కారును ఆవిష్కరించడంతో అనతి కాలంలోనే కస్టమర్స్ కళ్లలో పడడటమే కాకుండా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ జూన్ నెల మొదటి వారంలోనే లాంచ్ అయిన మారుతి సుజుకి జిమ్నీ మహింద్రా థార్ కి పోటీగా భారీ పబ్లిసిటీని సొంతం చేసుకుంది. NEXA డీలర్‌షిప్స్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్న ఈ SUV కారు ఇప్పటికే 31,000 కంటే ఎక్కువ బుకింగ్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ SUV కారుని సొంతం చేసుకోవాలంటే.. కనీసం 8 నెలల వరకు వెయింటింగ్ చేయకతప్పదు.
ఇది కూడా చదవండి : 4X4 SUV Cars : 4X4 SUV సెగ్మెంట్‌లో తక్కువ ధరలో లభించే కారు
మారుతి సుజుకి జిమ్నీ ధర
మారుతి సుజుకి జిమ్నీ ధరలను పరిశీలిస్తే.. ఈ కారు రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.74 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.05 లక్షల వరకు ఉంది. 105hp, 134Nm, 1.5-లీటర్, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ సహాయంతో పని చేసే ఈ ఎస్‌యూవీ కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్స్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Hero Xtreme 160R 4V Launch: మార్కెట్లోకి మరో కొత్త బైక్.. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V
ఇది కూడా చదవండి : Maruti Invicto: మారుతి నుంచి కొత్త ఎంపీవీ 7 సీటర్, 25 వేలు చెల్లించి ఇవాళే బుక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK