Maruti Suzuki Jimny vs Mahindra Thar: మార్కెట్‌లో ఆఫ్‌ రోడ్డు కార్లు లాంచ్‌ అయినప్పటి నుంచి కస్టమర్లు వాటిని కొనుగోలు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే భారత్‌లో ఆఫ్‌ రోడింగ్‌ కార్లలో మహీంద్రా థార్ అత్యుత్తమమైనది. అయితే దీనికి పోటీగా ఐదు డోర్లు కలిగిన మారుతి సుజికి జిమ్నీ మార్కెట్‌లోకి రాబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే సుజికి జిమ్నీకి సంబంధించిన ప్రీ-ఆర్డర్ కూడా ప్రారంభించింది. ఇది  ఏప్రిల్ లేదా జూన్‌ మొదటి వారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే చాలా మంది ఈ రెండింటిలో ఏ కారును కొనుగోలు చేయాలని కన్ ఫ్యూజన్ అయ్యే వారి కోసం ఈ స్టోరీ..అయితే ఈ రెండు  ఆఫ్‌ రోడింగ్‌ కార్ల విషయాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతీ సుజుకి జిమ్నీ vs మహీంద్రా థార్:


స్పెసిఫికేషన్లు మారుతీ సుజుకి జిమ్నీ మహీంద్రా థార్
ఇంజిన్ 1462 సిసి 1497 cc – 2184 cc
BHP 103.39 Bhp 116.93 - 150.0 Bhp
సీటింగ్ కెపాసిటీ 4 4
డ్రైవ్ రకం AWD RWD / 4X4
మైలేజ్ పెట్రోల్ పెట్రోలు 15.2kmpl
ఇంధనం డీజిల్/పెట్రోల్ డీజిల్/పెట్రోల్

జిమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (105PS/134Nm)తో మార్కెట్‌లోకి రాబోతోంది. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ రెండు ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 4WD డ్రైవ్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. మహీంద్రా థార్  2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో 4WD మోడల్‌లు 150 హార్స్‌పవర్‌తో 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో ప్రీమియంలో లభిస్తోంది. రెండు ఇంజన్లతో సిక్స్-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో మార్కెట్‌లోకి విడుదలైంది.


జిమ్నీలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. మహీంద్రా థార్‌లో థార్ ఆపిల్ కార్‌ప్లేతో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఏడు-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, LED DRLలతో కూడిన హాలోజన్ హెడ్‌లైట్లు, ఎలక్ట్రికల్ కంట్రోల్డ్ ఎయిర్ కండీషనర్ వంటి చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి చాలా రకాల ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


భారత్‌లో రెండు ఆఫ్ రోడ్డు కార్ల ధరలు:
మారుతి జిమ్నీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల కంటే తక్కువగానే ఉండబోతోందని కంపెనీ తెలిపింది. ఇక ఇది ప్రీమియం వేరియంట్‌తో కూడిన సెట్‌అప్‌తో జిమ్నీ మార్కెట్‌లోకి రానుంది. ఇక మహీంద్రా థార్ విషయానికొస్తే ఇది భారత మార్కెట్‌లో రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 16.29 లక్షలుగా ఉంది.


Also Read: Rakul Preet Latest: గాగ్రా చోళీలో రకుల్ ప్రీత్ హాట్ ట్రీట్.. సింపుల్ గా కనిపిస్తూనే కవ్విస్తోంది!


Also Read: Ketika Sharma Bold Photos: ప్యాంట్ బటన్లు విప్పేస్తున్న కేతిక శర్మ.. కుర్రకారు తట్టుకోగలరా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook