COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Suzuki Swift 2024: మారుతి సుజుకి స్విఫ్ట్‌కు మార్కెట్లో ఉన్న ప్రజాదరణ అంతో ఇంతో కాదు.. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే ఈ కారు లభించడంతో కస్టమర్స్ కూడా కొనుగోలు చేశారు. అయితే మారుతి సుజుకి మార్కెట్లో ఈ కారుకున్న ప్రజాదరణను గుర్తించి.. మరోసారి ఈ స్విఫ్ట్‌ని అప్డేట్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. మారుతి సుజుకి కంపెనీ ఈ కారు విడుదలకు సంబంధించిన తేదీని కూడా ప్రకటించింది. అయితే ఈ మే 9వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. లాంచింగ్ ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇది ప్రీమియం ఎక్ట్సీరియర్‌తో పాటు ఇంటీరియర్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారు లాంచింగ్ ముందే మార్కెట్‌లో మంచి టాక్ సంపాదించుకుంది. దీంతో చాలామంది ఈ కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఈ కారుకు సంబంధించిన డిజైన్ వివరాలు ఫీచర్స్‌ను తెలుసుకోవాలనుకుంటున్నారు.. మీరు కూడా ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ డిజైన్ చూడాలనుకుంటున్నారా?


ఇటీవల సోషల్ మీడియాలో లీకైన వివరాల ప్రకారం.. మారుతి స్విఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో భాగంగా అనేకమార్పులను కలిగి ఉండబోతోంది. అలాగే బంపర్‌లో ఫాగ్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మోనోటోన్ వైట్ ఫినిషింగ్‌తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ఇందులో గ్లోబల్ మార్కెట్ ఇంటీరియర్, 9-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్‌ వంటి సెటప్ లతో అందుబాటులోకి రాబోతోంది. ఇవే కాకుండా డిజిటల్ AC ప్యానెల్, ADAS టెక్నాలజీతో మారుతి సుజుకి ఈ స్విఫ్ట్‌ కారును విడుదల చేయబోతోంది.


మారుతి స్విఫ్ట్ సంబంధించిన మైలేజ్ ఇంజన్ సంబంధిత లీక్ అయిన వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన Z సిరీస్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు 3-సిలిండర్ ఇంజన్‌పై కారు రన్ కాబోతోంది. దీంతోపాటు ఈ ఇంజన్ 81.6ps పవర్ అవుట్‌పుట్‌ను అందించబోతోంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు లీటర్‌కు 25.72 కిమీ మైలేజీని ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాల ప్రకారం తెలుస్తోంది. అలాగే గతంలో ఉన్న మోడల్‌తో పోలిస్తే ఈ మోడల్ దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ఎక్కువగా మైలేజీని ఇచ్చే ఛాన్స్ ఉంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్‌:
6 ఎయిర్‌బ్యాగ్‌
9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్
వెనుక భాగంలో కూడా AC వెంట్
వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
LED ఫాగ్ ల్యాంప్స్
సుజుకి కనెక్ట్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి