Vehicle Sales In January 2024: ప్రముఖ కార్ల తయారీదారులు మారుతీ సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్ జనవరిలో అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను (Best Selling Cars) నమోదు చేశాయి. మారుతి సుజుకి 166,802 యూనిట్లను విక్రయించగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్తగా ప్రారంభించిన హ్యుందాయ్ క్రెటా ద్వారా 57,115 యూనిట్లను అమ్మకాలు చేసింది. టాటా మోటార్స్ అమ్మకాలు 12 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహనాల కంపెనీలు హోండా మోటార్‌సైకిల్ &స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్ కంపెనీలు కూడా భారీ వృద్ధిని సాధించాయి. ఈ వాహనాలు అమ్మకాలు పెరిగినా.. వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గాయి. టాటా మోటార్స్ నష్టాలను చవిచుడగా.. మహీంద్రా ట్రాక్టర్స్ అమ్మకాలు 17 శాతం క్షీణించాయి. మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియాతోపాటు మహీంద్రా & మహీంద్రా, బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా అమ్మకాలు గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది పెరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతీ సుజుకీ గత నెలలో రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు కొనసాగించింది. వాహన విక్రయాలు జనవరిలో 15.5 శాతం పెరిగి.. 1,99,364 యూనిట్లకు చేరుకుంది. గతేడాది ఇదే నెలలో 1,72,535 యూనిట్లుగా ఉంది. మారుతీ సుజుకీ అత్యధిక నెలవారీ అమ్మకాలు ఇవే కావడం విశేషం. మారుతీ సుజుకి దేశీయ విక్రయాలు 13 శాతం పెరిగి 1,51,367 యూనిట్ల నుంచి 1,70,214 యూనిట్లకు చేరాయి.


టాటా మోటార్స్ గత నెలలో మన దేశంలో 84,276 యూనిట్లను విక్రయించింది. జనవరి 2023లో ఈ సంఖ్య 79,681 యూనిట్లుగా ఉంది. ఈ కంపెనీ మొత్తం విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి.. 86,125 యూనిట్లకు చేరుకున్నాయి. మహీంద్రా & మహీంద్రా కంపెనీ మొత్తం వాహన విక్రయాలు ఏడాది క్రితంతో పోలిస్తే జనవరిలో 15 శాతం పెరిగాయి. దీంతో మొత్తం విక్రయాలు 73,944 యూనిట్లకు చేరుకున్నాయి. యుటిలిటీ వాహనాల విక్రయాలు గతేడాది జనవరిలో 32,915 యూనిట్ల ఉండగా.. 31 శాతం పెరిగి 43,068 యూనిట్లకు చేరుకున్నాయి.


గత నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా హోల్‌సేల్ అమ్మకాలు 8.5 శాతం పెరిగాయి. దీంతో మొత్తం విక్రయాలు 67,615 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 62,276 యూనిట్లను విక్రయించింది. గత నెలలో హ్యుందాయ్ కార్ల విక్రయాలు 50,106 యూనిట్ల నుంచి 14 శాతం పెరిగాయి. దీంతో మొత్తం అమ్మకాలు 57,115 యూనిట్లకు చేరుకున్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ గత నెలలో 24,609 యూనిట్ల అమ్మకాలతో అత్యధిక నెలవారీ విక్రయాలను సాధించింది. గతేడాది జనవరిలో 12,835 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 92 శాతం ఎక్కువ కావడం విశేషం.


టూ వీలర్ విభాగంలో హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. జనవరిలో 41.50 శాతం పెరిగి.. 4,19,395 యూనిట్లకు చేరుకున్నాయి. 37 శాతం వృద్ధితో 3,82,512 యూనిట్లుగా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు స్వల్పంగా రెండు శాతం పెరిగాయి. దీంతో మొత్తం 76,187 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది జనవరి నెలలో కంపెనీ మొత్తం 74,746 వాహనాలను విక్రయించింది.


Also Read: Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


Also Read: వీరూ స్టైల్లో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్.. భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter