Meesho Reset And Recharge Break: ఉద్యోగమంటే తొమ్మిది గంటలు.. కానీ ఇంటికి వెళ్లాక కూడా అదే ఒత్తిడి కొనసాగుతుంది. ఉద్యోగ వేళలు ముగిసినా కూడా అదే వాతావరణంలో ఉండిపోతాం. జీతం కోసం కాదు మనసు పెట్టి పని చేద్దామంటే అలాంటి వాతావరణం ఉండదు. ఈ నేపథ్యంలోనే పనిలో నాణ్యత లేకపోవడం అనేది జరుగుతుంటుంది. అలాంటిది గుర్తించిన ఓ దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థ తమ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. ఆ రోజుల్లో వారంతా ల్యాప్‌టాప్‌ లేకుండా.. ఎలాంటి పని లేకుండా గడపాల్సి ఉంది. చేయాల్సిందంతా చిల్‌ అవ్వడమే. ఆ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tax Distributes: పన్నుల వాటా నిధులు: ఆంధ్రప్రదేశ్‌కు భారీగా.. తెలంగాణకు కోత పెట్టిన కేంద్రం


తమ ఉద్యోగులు పనిలో రీచార్జ్‌ పొందేందుకు సరికొత్తగా 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. గత మూడేళ్లుగా చేస్తున్నట్టు మాదిరే వరుసగా నాలుగో ఏడాది కూడా ఉద్యోగులకు ఆ బంపర్‌ ఆఫర్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. '9 రోజుల పాటు ల్యాప్‌టాప్‌లు ఉండవు. ఈ మెయిల్స్‌ రావు. స్టాండప్‌ కాల్స్‌ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు. దీని పేరే రెస్ట్‌ అండ్‌ రీచార్జ్‌ బ్రేక్‌' అని మీషో తెలిపింది.

Also Read: Scarlet Snake: సొగసైన అందాలతో బుసలు కొడుతున్న పాము.. భయపడక్కర్లేదు విషం లేదు


ఈ రెస్ట్‌ అండ్‌ రీచార్జ్‌ బ్రేక్‌ అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకు కల్పిస్తున్నట్లు మీషో వెల్లడించింది. దసరా, దీపావళి సందర్భంగా మెగా బ్లాక్‌బస్టర్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా బ్లాక్‌బస్టర్‌ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకునేందుకు మీషో ఈ అవకాశం కల్పించింది. 2024కు సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకు ఈ బ్రేక్‌ అని మీషో తెలిపింది. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీషో భావిస్తోంది.


గతంలో కూడా పలు కంపెనీలు ఇలాంటి విధానాలే కొన్నింటిని అమలు చేశాయి. వరుసగా పండుగలు ఉండడం.. సంవత్సరం ముగిసిపోతుండడంతో ఉద్యోగులకు గుర్తుండేలా ఏదో ఒకటి చేయాలని ఇలా వినూత్న ఆలోచనలతో కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రత్యేకంగా సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరికొన్ని సంస్థలు విదేశీ పర్యటనలు.. లేదా కొన్ని ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్తుంటాయి. ప్రస్తుతం దసరా, దీపావళి కావడంతో ఉద్యోగులకు పెద్ద ఎత్తున కానుకలు కూడా ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. బోనస్‌, కూపన్లు, గిఫ్ట్‌లు, పదోన్నతులు వంటివి కంపెనీలు ఇచ్చే యోచనలు చేస్తున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి