Mercedes Benz: మెర్సిడెస్ బెంజ్ నుంచి తుపాను వేగంతో దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఫీచర్లు, ధర వివరాలిలా
Mercedes Benz: ప్రముఖ లగ్జరీ, ప్రిస్టీజియస్ కారు మెర్సిడెస్ బెంజ్..ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ చేసింది. మెర్సిడెస్ బెంజ్ మ్యాటిక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mercedes Benz: మెర్సిడెస్ బెంజ్ నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్‌లో విడుదలైంది మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఇ 500 మ్యాటిక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. తుపాను వేగంతో దూసుకుపోతుందని కంపెనీ చెబుతోంది. ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఇ ధర 1.39 కోట్ల రూపాయలుంది. మార్కెట్ ఇది ఆడి క్యూ8 ఈ ట్రాన్, జాగ్వర్ ఐ పేస్ , బీఎండబ్ల్యు ఐఎక్స్‌తో పోటీ పడుతుంది. ఆడీ క్యూ8 ఈ ట్రాన్ ధర 1.14 కోట్ల నుంచి 1.26 కోట్ల వరకూ ఉంది. రెండవది జాగ్వర్ ఐ పేస్ అయితే 1.20 కోట్ల నుంచి 1.21 కోట్లు ఉంది. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ధర మార్కెట్‌లో దాదాపు అంతే ఉంది. ఈక్యూబీ, ఈక్యూఎస్ తరువాత దేశంలో జర్మనీకు చెందిన ఈ లగ్జరీ కారు మూడవ కారు కానుంది.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఇ 500 పవర్ ట్రేన్ సెటప్‌లో డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ లే అవుట్, 90.56 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డబ్ల్యూఎల్టీపీ సర్టిఫైడ్ రేంజ్ 550 కిలోమీటర్లు ఉంది. ఇందులో 11 కిలోవాట్స్ ఏసీ ఛార్జర్‌తో పాటు 170 కిలోవాట్స్ వరకూ ర్యాపిడ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ కారు ఎలక్ట్రిక్ మోటార్ సామర్ధ్యం 408 హెచ్ పి పవర్, 858 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగల సామర్ద్యం ఉంది. ఇది కేవలం 4.9 సెకన్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. టాప్ స్పీడ్ 210 కిలోమీటర్లు ఉంటుంది.
ఇందులో 25 మిల్లీమీటర్ల రైడ్ హైట్ ఎడ్జస్ట్‌మెంట్ సామర్ధ్యం, ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. ఫలితంగా జర్మీ చాలా సౌకర్యంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు పొడుగు 4,863 మిల్లీమీటర్లు కాగా, ఎత్తు 1685 మిల్లీమీటర్లుగా ఉంది. ఇందులో 3,030 మిల్లీమీటర్లు వీల్ బేస్ ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఇ 500 కారులో 56 ఇంచెస్ హైపర్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. ఇందులో 3 రకాలున్నాయి అన్నీ టెంపర్డ్ గ్లాస్ ఉత్పత్తులే. డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్‌ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేకు పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, 15 స్పీకర్ బర్మిస్టర్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ సీట్ మసాజ్ ఫంక్షన్‌తో వస్తుంది.
Also read: Tata Nexon vs Maruti Brezza: టాటా నెక్సాన్ వర్సెస్ బ్రిజాలలో ఏది మంచిది, ఏది తక్కువ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook