Meta, Twitter and Amazon Layoffs : వచ్చే ఏడాది ఆర్థిక మాంధ్యం వచ్చే ప్రమాదం ఉందన్న సూచీల నేపథ్యంలో ఐటి కంపెనీలైన ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా, మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ తో పాటు కార్పొరేట్ టెక్నాలజీ దిగ్గజం అమేజాన్ వంటి పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటికే భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా ఆయా కంపెనీల నుంచి సంచలనమైన ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఉద్యోగుల పర్‌ఫార్మెన్స్‌తో సంబంధం లేకుండా కేవలం తమపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించే పనిలో నిమగ్నం అయ్యాయి. అలా ఏయే కంపెనీలు ఎంత మంది ఉద్యోగులపై వేటు వేశాయో ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంచలన నిర్ణయం తీసుకున్న ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్
టెస్లా కార్లతో భారీ మొత్తంలో డబ్బు కూడబెట్టిన ఎలాన్ మస్క్.. అలా వచ్చిన మొత్తంతో ఏకంగా ట్విటర్ నే కొనేశాడు. ట్విటర్ ని టేకోవర్ చేసిన వెంటనే ఎవ్వరూ ఊహించని విధంగా 50 శాతం మంది ఉద్యోగులను తొలగించి కార్పొరేట్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాడు. ఆర్థికంగా సంస్థను గాడిలో పెట్టాలంటే ఉద్యోగులను తొలగించడం తప్ప మరో మార్గం లేదని ఎలాన్ మస్క్ స్పష్టంచేశాడు.


ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటా కంపెనీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కూడా ట్విటర్ హెడ్ ఎలాన్ మస్క్ మార్గాన్నే ఎంచుకున్నాడు. సంస్థ నష్టాల్లో కూరుకుపోతోందని.. మెటా కంపెనీని తిరిగి ఆర్థికంగా గాడిలో పెట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా 11 వేల మంది ఉద్యోగులను తొలగించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదంటూనే ఆ 11 వేల మంది ఉద్యోగులకు లాస్ట్ వర్కింగ్ డే డీటేల్స్ పంపించాడు. కార్పొరేట్, ఐటి చరిత్రలో ఇప్పటివరకు ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద లేఆఫ్ గా కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి. 


రెండుసార్లు ఉద్యోగాల కోత కోసిన నెట్‌ఫ్లిక్స్
ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఓటిటి దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సైతం కరోనా ప్యాండెమిక్ తర్వాత నష్టాలు చవిచూసింది. దీంతో ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ రెండుసార్లు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఏడాది అక్టోబర్ నెల వరకే 450 మంది ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ ఫైర్ చేసింది. 


20 శాతం ఉద్యోగులను పక్కన పెట్టిన స్నాప్ 
ఆగస్టు చివర్లో స్నాప్ కూడా 20 శాతం మంది ఉద్యోగులను పక్కన పెట్టేసింది. ఇది మొత్తం సిబ్బందిలో 1000 మంది ఉద్యోగులకు సమానం. రాబోయే కాలంలో ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవాలంటే సంస్థను రీస్ట్రక్చర్ చేయక తప్పడం లేదని.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని స్నాప్ సీఈఓ ఇవన్ స్పీజెల్ ప్రకటించారు. 


14 శాతం మంది ఉద్యోగులను తొలగించిన స్ట్రైప్ 
ఆన్‌లైన్ పేమెంట్స్ దిగ్గజం స్ట్రైప్ గత వారమే 14 శాతం మంది ఉద్యోగులను ఫైర్ చేసింది. తొలగించిన ఉద్యోగులకు మూన్నెళ్ల జీతభత్యాలు అందిస్తున్నట్టు స్ట్రైప్ పేర్కొంది. పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్, రిసెషన్, వడ్డీ రేట్లు, నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని స్ట్రైప్ సీఈఓ ప్యాట్రిక్ కొలిషన్ స్పష్టంచేశారు.


1 శాతం ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు అక్టోబర్‌లోనే ధృవీకరించింది. మొత్తం సిబ్బందిలో ఈ ఒక్క శాతం సిబ్బంది 1000 మంది ఉద్యోగులకు సమానం.


వ్యయ భారాన్ని తగ్గించుకునే క్రమంలో 2500 మంది ఉద్యోగులపై వేటు వేసిన బైజుస్ తాజాగా స్టాక్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ సమాచారంలో మరోసారి నియామకాల ప్రక్రియ చేపట్టనున్నట్టు స్పష్టంచేసింది.