Bank Loans: బ్యాంకుల్నించి లేదా ఆర్ధిక సంస్థల నుంచి లోన్ తీసుకునేముందు కచ్చితంగా గుర్తుంచుకోవల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. రుణం తీసుకోవాలంటే అవి కచ్చితంగా తెలుసుకుంటే మంచిది..అవేంటో చూద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటి నిర్మాణం కోసమే, ఇంట్లో పెళ్లిళ్ల కోసమో, వ్యక్తిగత అవసరాల కోసమో, చదువు కోసమో, వ్యాపారం కోసమో రుణాలు తీసుకుంటుంటాం. రుణం తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంకులు ఎప్పుడూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లతో ప్రకటనలిస్తుంటాయి. అది చూసి పూర్తి వివరాలు తెలుసుకోకుండా లోన్ తీసుకోకూడదు. రుణం ఎంత వస్తుంది, వడ్డీ ఎంత, ఎంత సమయం పడుతుంది, ప్రత్యేక ఛార్జీలు ఉన్నాయా లేవా, కమీషన్ ఉందా వంటి చాలా అంశాలుంటాయి.


వీటితోపాటు తెలుసుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం ఈఎమ్ఐ. రుణమైతే మీ అర్హత, లభ్యతను బట్టి వస్తుంది. అయితే మీరు చెల్లించే ఈఎమ్ఐ ఎంత ఉంటుందనేది ముందే తెలుసుకోవాలి. ప్రతినెలా ఈఎమ్ఐ మొత్తాన్ని పక్కకు పెట్టేయాల్సిందే. ఎందుకంటే ఈఎమ్ఐ చెక్ బౌన్స్ అయితే సమస్యలెక్కువౌతాయి. బ్యాంకుల్ని బట్టి వడ్డీ ఉంటుంది. ఏ బ్యాంకు వడ్డీ రేటు ఎంత ఉందో పరిశీలించుకుని తీసుకోండి. వడ్డీ అనేది మీకు తెలియకుండానే మీ నుంచి మొత్తం వసూలు చేస్తుంది. అదే సమయంలో తీసుకున్న రుణాన్ని ఒకేసారి చెల్లించే పరిస్థితి వస్తే..ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా..3 శాతం వడ్డీతో మిగిలిన మొత్తాన్ని చెల్లించేయవచ్చు.


Also read: Interest Rates: కోటక్ మహీంద్రా గుడ్‌న్యూస్, ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook