TRF Share: షేర్ మార్కెట్‌లో ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఎప్పుడు ఏమౌతుందో తెలియని పరిస్థితి. టాటా కంపెనీ షేర్ అలాగే లాభాలు కురిపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్‌లో కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లకు లాభాలు పండిస్తుంటాయి. టాటా గ్రూపుకు చెందిన ఒక స్టాక్ అలానే పెట్టుబడిదారుల పంట పండించింది. కేవలం 7 రోజుల్లో అద్భుత లాభాలు తెచ్చిపెట్టింది. టాటా గ్రూప్‌కు చెందిన ఈ షేర్ నిరంతరం పైకే ఎదుగుతూ కన్పించింది. 


7 రోజుల్లో 101 శాతం లాభాలు


టాటా గ్రూప్‌కు చెందిన ఈ షేర్ టీఆర్ఎఫ్ షేర్. ఈ షేర్ గత 7 రోజుల్లో 101 శాతం లాభాల్ని ఆర్జించింది. ఇవాళ మంగళవారం నాడు ఈ కంపెనీ షేర్ 4.99 శాతం వృద్ధితో మరో 16.20 రూపాయలు పెరిగింది. 


నెలలో ఎంత పెరిగిందంటే


గత 5 రోజుల్లో గ్రాఫ్ ఓసారి పరిశీలిస్తే..స్టాక్‌లో 41.54 శాతం వృద్ధి నమోదైంది. గత 5 రోజుల్లో కంపెనీ షేర్ 99.95 రూపాయలు పెరిగింది. ఒక నెలలో క్రితం కంపెనీ షేర్ 114.99 శాతం పెరిగింది. మొత్తానికి ఈ కంపెనీ షేర్ 182.15 రూపాయలు పెరుగుదల నమోదైంది. 


టీఆర్ఎఫ్ షేర్ రికార్డు స్థాయిలో 340.55 రూపాయలకు చేరుకుంది. 52 వారాల అత్యధికం ఇది. కనిష్టం 106.10 రూపాయలుంది. మార్చ్ 21వ తేదీన ఈ షేర్ 163 రూపాయలుంది. 6 నెలల్లో ఈ షేర్ ధర 177.50 రూపాయలు పెరిగింది. జనవరి నుంచి ఇప్పటి వరకూ ఈ షేర్ ధర 203.75 రూపాయలు పెరిగింది. 


టీఆర్ఎఫ్ కంపెనీ విద్యుత్, ఉపకరణాలు, సిమెంట్ వంటి రంగాలకు సామగ్రిని అందిస్తుంటుంది.


Also read: Big Billion Days Sale 2022: నైకి, రీబాక్, కిల్లర్, అడిడాస్‌ బ్రాండ్లపై 70 శాతం డిస్కౌంట్‌.. అవును ఇది నిజమే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook