షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే రెహ్తన్ టీఎంటీ షేర్ సరైన ప్రత్యామ్నాయం కాగలదు. ఇన్వెస్టర్లకు అమితమైన లాభాల్ని అందించింది. ఐరన్, స్టీల్ వ్యాపారానికి సంబంధించిన ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాల్ని తెచ్చిపెట్టింది. ఈ కంపెనీ షేర్ ఇప్పుడు వేగంగా పెరుగుతోంది. ఫలితంగా బోనస్, స్టాక్స్‌ను స్ప్లిట్ చేసేందుకు యోచిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి నాలుగు షేర్లకు 11 బోనస్ షేర్లు


రెహ్తన్ టీఎంటీ కంపెనీ 10 రూపాయల ఫేస్ వ్యాల్యూతో ఈక్విటీ షేర్‌ను ఒక రూపాయి ఫేస్ వ్యాల్యూతో పది ఈక్విటీ షేర్లుగా విభజించేందుకు అనుమతించింది. దాంతోపాటు ప్రతి నాలుగు షేర్లపై 11 బోనస్ షేర్లు ఇచ్చేందుకు కంపెనీ బోర్డు అనుమతించింది. దీనికోసం కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు జనవరి 31, 2023న రికార్డ్ డైట్ ప్రకటించారు. ఈ కంపెనీ టీఎంటీ బార్, రౌండ్ తయారుచేస్తోంది. నిర్మాణరంగంలో కీలకంగా ఉపయోగిస్తారు. రెహ్తన్ టీఎంటీ షేర్ విలువ 442 రూపాయలుంది. 


2022లో రెహ్తన్ ఐపీవో


రెహ్తన్ టీఎంటీ ఐపీవో 2022లో వచ్చింది. ఈ కంపెనీ షేర్ బీఎస్ఈలో సెప్టెంబర్ 2022లో లిస్ట్ అయింది. ఆ సమయంలో రెహ్తన్ ఐపీవో ధర 70 రూపాయలుంది. ఈ షేర్ కొద్దికాలంలోనే అద్భుతమైన వృద్ధి నమోదుచేసింది. 52 వారాల గరిష్ట ధర 479 రూపాయలు కాగా, కనిష్టం 50.60 రూపాయలుంది. నిన్న మంగళవారం మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి కంపెనీ షేర్ విలువ 442 రూపాయలుంది. ఇవాళ కూడా ఈ కంపెనీ షేర్ పెరుగుతోంది. 


ఒకవేళ ఆ సమయంలో మీరు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుంటే ఇవాళ మీ పెట్టుబడి 7 లక్షల రూపాయలయ్యేది. కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ 945 కోట్ల రూపాయలు. ఈ కంపెనీ అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీ. రెహ్తన్ రోలింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1984లో ప్రారంభమైంది.


Also read: Stock Split: డీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ షేర్స్‌ స్ప్లిట్.. వీటి విలువ తగ్గే అవకాశాలున్నాయా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook