Multibagger Stock: షేర్ మార్కెట్‌లో ఇటీవలి కాలంలో మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి తరచూ వింటున్నాం. తక్కువ వ్యవధిలో అత్యధికంగా రిటర్న్స్ అందిస్తుంటాయి. అలాంటిదే ఓ కంపెనీ షేర్ గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్ అంటేనే ఓ లోతైన ప్రపంచం. సరిగ్గా అర్ధం చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు. అదే సమయంలో కొంత అదృష్టం కూడా తోడుగా ఉండాలి. ఏడాదిలో లక్ష రూపాయల్ని 20 లక్షలుగా మార్చిన కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యమైంది జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ షేర్. ఇదొక స్మాల్‌క్యాప్ కంపెనీ. 


6 నెలల్లో ఎంత పెరిగింది


జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షేర్  ప్రస్తుతం 2.51 శాతం తగ్గుదలతో 1390.65 రూపాయల వద్ద క్లోజ్ అయింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ తగ్గుతోంది. అటు గత 6 నెలల్లో ఇన్వెస్టర్లకు 369.18 శాతం రిటర్న్స్ అందించింది. మార్చ్ 28వ తేదీన ఈ కంపెనీ షేర్ విలువ 296 రూపాయలు కాగా ఆరు నెలల్లో 1094.25 రూపాయలు ప్రతి షేర్‌పై పెరిగింది.


జనవరి 3 వతేదీన ఈ స్టాక్ విలువ 119 రూపాయలుంది. వైటీడీ సమయంలో స్టాక్ 1067.14 శాతం వేగం పుంజుకుంది. ఈ సమయంలో షేర్ విలువ 1271.50 రూపాయలకు పెరిగింది. ఒకవేళ జనవరిలో మీరు 1 లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టుంటే..కేవలం 9 నెలల్లో మీ లక్ష రూపాయలు 11.67 లక్షలయ్యేది. ఆరు నెలల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..4.69 లక్షల రూపాయలు రిటర్న్స్ అందేవి.


ఏడాదిలో 20 లక్షలైన లక్ష రూపాయలు


గత ఏడాది గణాంకాలు పరిశీలిస్తే..2021 సెప్టెంబర్ 21న షేర్ విలువ 67.88 రూపాయలుగా ఉంది. ఏడాదిలో ఈ షేర్ ఇన్వెస్టర్లకు 1948.69 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ కాలంలో షేర్ విలువ 1322.77 రూపాయలకు పెరిగిపోయింది. ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టుంటే..19 లక్షల రూపాయలయ్యేది. ఈ కంపెనీ 52 వారాల రికార్డ్ విలువ చూస్తే 1990 రూపాయలుంది. 52 వారాల కనిష్ట విలువ 54.45 రూపాయలుంది. 


Also read: Aadhaar Photo Update: ఆధార్ కార్డు ఫోటో ఆన్‌లైన్‌లో సులభంగా ఎలా మార్చుకోవడం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook