Multibagger Stocks: కేవలం 6 నెలల్లో 90 శాతం వృద్ధి నమోదు చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్ ఏదో తెలుసా
Multibagger Stocks: షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌కు విశేష ప్రాధాన్యత ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ అందిస్తుంటాయి. అలాంటిదే ఒక కంపెనీ షేర్..కేవలం 6 నెలల్లో ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టింది.
షేర్ మార్కెట్‌లో వేలాది కంపెనీల షేర్లు లిస్టింగ్ అయున్నాయి. ఇందులో కొన్ని షేర్లు ఇన్వెస్టర్లపై ధనవర్షం కురిపిస్తుంటాయి. ఇందులో మల్టీబ్యాగర్ స్టాక్స్ కీలకం. అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించిపెడతాయి. అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ ఒకటి కేవలం 6 నెలల్లో అద్భుతమైన రిటర్న్స్ అందించింది.
బీఎల్బీ లిమిటెడ్
ఇప్పుడు మనం చర్చించుకుంటున్నది బీఎల్బీ లిమిటెడ్ కంపెనీ గురించి. ఈ కంపెనీ షేర్ కేవలం కొన్ని నెలల్లోనే ఒక్కసారిగా పైకి ఎగిసింది. గత 6 నెలల్లో ఈ కంపెనీ షేర్ ఏకంగా 90 శాతం పెరిగింది. నెల రోజుల క్రితం షేర్ ధర 71 శాతం కంటే ఎక్కువ వేగంగా వృద్ధి నమోదు చేసింది. అంతేకాదు..గత 5 రోజుల్లో కూడా 30 శాతం కంటే ఎక్కువే వృద్ధి సాధించింది.
బీఎల్బీ షేర్
జూలై 5, 2022న ఈ కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 17.90 రూపాయలకు క్లోజ్ అయింది. ఆ తరువాత కొద్దిగా క్షీణించింది. తరువాత 2022 జూలై 27 న 15 రూపాయలకు క్లోజ్ అయింది. ఇక అక్కడి నుంచి వేగం పుంజుకుంది. ఇప్పుడీ కంపెనీ షేర్ 34 రూపాయలు దాటేసింది. ఈ కంపెనీ షేర్ జనవరి 4, 2023న 34.30 రూపాయలకు క్లోజ్ అయింది. అంటే 6 నెలల్లో 91.62 శాతం వృద్ధి నమోదు చేసింది.
బీఎల్బీ షేర్ ధర
2022 డిసెంబర్ 5న ఈ షేర్ ధర 20.05 రూపాయలుంది. అప్పటి నుంచి అంటే ఒక నెలలో 71.07 శాతం పెరిగింది. డిసెంబర్ 29, 2022న షేర్ ధర 24.55 రూపాయలుంది. అంటే ఐదు రోజుల వ్యవధిలో 30.67 శాతం పెరిగింది. షేర్లు, సెక్యూరిటీల్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్ చేయడం కంపెనీ వ్యాపారం.
Also read: Share Market: కేవలం నెల రోజుల్లోనే ఇన్వెస్టర్లకు కోట్లాది రూపాయలు నష్టాలు మిగిల్చిన ఆ కంపెనీ షేర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook