షేర్ మార్కెట్‌లో చాలా రకాల షేర్లుంటాయి. ఇందులో కొన్ని షేర్లు స్వల్పకాలంలోనే ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు ఆర్జించిపెడుతుంటాయి. అటువంటిది ఒక కంపెనీ షేర్..ఊహించని లాభాల్ని తెచ్చిపెట్టింది. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ఓ కంపెనీ షేర్ స్వల్పకాలంలో 35 వేల రూపాయల పెట్టుబడిని 5 లక్షలు చేసేసింది. ఆ కంపెనీ పేరు మధ్య భారత్ ఆగ్రో ప్రొడక్ట్స్. ఈ కెంపెనీ షేర్ గత ఏడాది వరకూ 35 రూపాయలుండేది. ఆ తరువాత హఠాత్తుగా పెరుగుతూవచ్చింది. ఇప్పుుడు ఈ కంపెనీ షేర్ విలువ 500 రూపాయలైంది. 2021 జనవరి 1న ఈ కంపెనీ షేర్ 34.90 రూపాయలకు క్లోజ్ అయింది. ఆ తరువాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2022 ఫిబ్రవరి నాటికి 100 రూపాయలైంది. ఇక అప్పట్నించి ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జించి పెడుతోంది. 


అటు అక్టోబర్ 19, 2022 ఈ కంపెనీ షేర్ ధర 505.40 రూపాయలుంది. ఇదే గరిష్ట ధర. 52 వారాల అత్యధిక ధర ఇదే కావడం విశేషం. ఇక 52 వారాల కనిష్ట ధర 79.43 రూపాయలుగా ఉంది. 


ఎవరైనా 2021లో మద్య భారత్ ఆగ్రో ప్రోడక్ట్స్‌లో ఒక వేయి షేర్లను 35 రూపాయల చొప్పున కొనుగోలు చేసుంటే..35 వేల రూపాయలు పెట్టుబడి అయ్యుండేది. అదే ఇప్పుడు షేర్ ధర 505 రూపాయలవడంతో..వేయి షేర్ల విలువ 5 లక్షల 5 వేలకు చేరుండేది. 


Also read: PPF New Rules: పీపీఎఫ్‌లో కీలక మార్పులు.. అకౌంట్ ఓపెన్, డబ్బులు డిపాజిట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook