Multibagger stock: 3 వేల పెట్టుబడితో 19 లక్షల రూపాయలు లాభాలు, ఆ కంపెనీ షేర్ ఫలితం
Multibagger stock: షేర్ మార్కెట్‌లో పెట్టుబడితో మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. దీర్ఘకాలం నిరీక్షిస్తే పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు లభిస్తాయి. కేవలం 3 వేల పెట్టుబడితో 19 లక్షలు సంపాదించిన పరిస్థితి..
Multibagger stock: షేర్ మార్కెట్‌లో పెట్టుబడితో మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. దీర్ఘకాలం నిరీక్షిస్తే పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు లభిస్తాయి. కేవలం 3 వేల పెట్టుబడితో 19 లక్షలు సంపాదించిన పరిస్థితి..
ఏదైనా షేర్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంటే తక్కువ ధర ఉన్నప్పుడే ఆ షేర్ కొనుగోలు చేస్తే కొంతకాలం తరువాత కచ్చితంగా మంచి రిటర్న్స్ లభిస్తాయి. ఇలాంటి షేర్లను మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలుంటాయి. షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఇలానే ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేస్తుంటాయి. అలాంటిదే ఓ షేర్ గురించి తెలుసుకుందాం..
కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ స్టాక్ ఇది. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో ఎక్కువ లాభాల్ని అందించింది. 20 ఏళ్లలో కంపెనీ షేర్ ధర ఆకాశాన్నంటింది. ఓ సమయంలో ఈ కంపెనీ షేర్ ధర 3 రూపాయలకంటే తక్కువే. ఇప్పుుడు మాత్రం 1900 రూపాయలకు చేరుకుంది.
2001 నవంబర్ 8వ తేదీన ఈ కంపెనీ షేర్ 2.81 రూపాయలుంది. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. 2017లో ఈ కంపెనీ షేర్ ధర 1500 రూపాయలకు చేరుకుంది. ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. 2020 నాటికి ఈ కంపెనీ షేర్ 500 కంటే తక్కువకు పడిపోయింది. ఆ తరువాత తిరిగి వేగంగా పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ కంపెనీ షేర్ సెప్టంబర్ 23న 1940 రూపాయలకు చేరుకుంది.
ఈ కంపెనీ షేర్ 52 వారాల కనిష్టం 1201.05 రూపాయలుంది. అటు సెప్టెంబర్ 23 నాటికి 1840.05 రూపాయలకు క్లోజ్ అయింది. అదే 2001-2002 సమయంలో ఈ కంపెనీ షేర్ 3 రూపాయల చొప్పున ఉన్నప్పుడు 3 వేలు పెట్టి 1000 షేర్లు కొనుగోలు చేసుంటే..20 ఏళ్ల తరువాత అదే వేయి షేర్లు 1900 చొప్పున 19 లక్షలుగా మారింది.
Also read: Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook