షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉన్నప్పుడు మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి. ఈ స్టాక్స్ స్వల్ప కాలంలో అత్యధిక రిటర్న్స్ ఇస్తుంటాయి. కేవలం ఏడాదిలో ఊహించని లాభాల్ని ఇచ్చిన మూడు కంపెనీల షేర్ల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు కంపెనీల షేర్లు కేవలం ఏడాది కాలంలో 1385 నుంచి 1592 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో బోంబే మెట్రిక్స్ సప్లై ఛైన్. రీజెన్సీ సిరమిక్స్, పార్టీ క్రూజర్ ఉన్నాయి. 


గత ఐదేళ్ల వ్యాపారంలో రీజెన్సీ సిరామిక్స్ కంపెనీ షేర్ 21.09 శాతం వేగంతో పెరిగింది. ఈ సమయంలో కంపెనీ షేర్ 5.60 రూపాయలు పెరిగింది. గత నెలలో ఈ కంపెనీ షేర్ విలువలో 7.71 శాతం పెరుగుదల నమోదైంది. 


గత ఆరు నెలల ఛార్ట్ పరిశీలిస్తే..1548.72 శాతం పెరుగుదల కన్పించింది. మే 2 వ తేదీన ఈ కంపెనీ షేర్ 1.95 రూపాయలుండగా..ఆ తరువాత 30.20 రూపాయలు పెరిగిపోయింది. ఏడాది క్రితం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే..ఇప్పుడు ఆ విలువ 16 లక్షల 48 వేలకు చేరుండేది. 


పార్టీ క్రూయిజర్స్ కంపెనీ షేర్


పార్టీ క్రూయిజర్స్ కంపెనీ షేర్ 1497 శాతం వరకూ పెరిగింది. గత 3 నెలల్లో ఈ కంపెనీ షేర్ 263 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత వారంలో 26 శాతం కంటే ఎక్కువే రిటర్న్ నమోదైంది. 


ఇక మూడవ కంపెనీ బోంబే మెట్రిక్స్ సప్లై ఛైన్ కూడా ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చింది. గత ఏడాదిలో షేర్ ఇన్వెస్టర్లకు 1385 శాతం పెరిగింది. గత మూడు నెలలు పరిశీలిస్తే..ఇన్వెస్టర్లు పెట్టిన లక్ష రూపాయల పెట్టుబడి 3 లక్షలుగా మారింది. 


Also read: Multibagger share: కేవలం ఏడాదిలో 35 వేలు..5 లక్షలైతే ఎలా ఉంటుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook