New Financial Rules: ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం రేపటితో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుతో కొత్త రూల్స్ కూడా అమలుకానున్నాయి. ముఖ్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పన్ను మినహాయింపు పరిమితి పెరిగింది. స్టాండర్డ్ డిటెక్షన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా.. ఎక్కువ జీతం పొందేవారికి కొంత ప్రయోజకరంగా మార్చారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలు కానున్న టాప్-10 విషయాల గురించి తెలుసుకోండి.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

==> ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో ప్రత్యామ్నాయ ఇన్‌కమ్ ట్యాక్స్ విధానాన్ని రూపొందించింది. దీని కింద ఇంటి అద్దె భత్యం వంటి ప్రత్యేక మినహాయింపులు, తగ్గింపులను పొందకపోతే తక్కువ రేట్లకే పన్ను చెల్లించవచ్చు. హెచ్ఆర్ఏ, హౌస్ లోన్‌పై వడ్డీ, సెక్షన్ 80సీ, 80డీ, 80సీసీడీ కింద చేసిన పెట్టుబడులపై రూ.2.5 లక్షల వరకు మొత్తం ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది.


==> ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై స్వల్పకాలిక మూలధన లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడులపై దీర్ఘకాలిక పన్ను మినహాయింపు కోల్పోతారు. 


==> పాత పన్ను విధానంలో ఉద్యోగులకు లభించే రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌లో ఎలాంటి మార్పు లేదు. పెన్షనర్లకు, కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే ప్రతి జీతం పొందే వ్యక్తి రూ.52,500 ప్రయోజనం పొందుతారు.


==> లైఫ్ ఇన్స్‌రెన్స్ ద్వారా 5 లక్షల వార్షిక ప్రీమియం కంటే ఎక్కువ ఆదాయం వస్తున్నట్లయితే.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను నిబంధన వర్తించదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. యులిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)కి దరఖాస్తు చేసుకోండి.


==> ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అంటే వార్షిక ఆదాయం రూ. 7 లక్షల వరకు ఉన్న వ్యక్తి మినహాయింపును క్లెయిమ్ చేయడానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ఆదాయంపై ట్యాక్స్ ఉండదు.


==> ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కొంత పరిమితి వరకు మినహాయించారు. ఈ లిమిట్ 2002 నుంచి రూ.3 లక్షలు కాగా ఇప్పుడు రూ.25 లక్షలకు పెంచారు.


==> మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుగామార్చినట్లయితే మూలధన మినహాయింపు ఉండదని సీతారామన్ చెప్పారు. ఈ నియమం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.


==> సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచనున్నారు. నెలవారీ ఆదాయ పథకం గరిష్ట డిపాజిట్ పరిమితి సింగిల్ ఖాతాలకు రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు, జాయింట్ ఖాతాలకు రూ.7.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచనున్నారు.


==> ఏప్రిల్ 1 తర్వాత మార్కెట్ లింక్డ్ డిబెంచర్స్ (ఎంఎల్‌డీ)లో పెట్టుబడులు స్వల్పకాలిక మూలధన ఆస్తులుగా ఉంటాయి. ఇది అంతకుముందు పెట్టుబడులకు స్వస్తి పలకనుంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమపై స్వల్ప ప్రతికూల ప్రభావం చూపుతుంది.


==> కొత్త పన్ను రేట్లు-0-3 లక్షలు –నిల్, 3-6 లక్షలు–5 శాతం, 6-9 లక్షలు– 10 శాతం, 9-12 లక్షలు – 15 శాతం, 12-15 లక్షలు–20 శాతం, 15 లక్షల కంటే ఎక్కువ – 30 శాతం.


Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!  


Also Read: Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి