Changes in September: సెప్టెంబర్ నుంచి ఈ 5 అంశాల్లో కీలక మార్పులు, ఇప్పుడే చెక్ చేసుకోండి
Changes in September: మరో నాలుగు రోజుల్లో ఆగస్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ కొత్త నెల ప్రారంభమౌతూనే కీలక మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఇవి సాధారణ మార్పులే అయినా వ్యాలెట్ ను ప్రభావితం చేస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Changes in September: నిత్య జీవితంలో ఆర్ధిక వ్యవహారానికి సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రతి నెలా మార్పులు చేర్పులు కన్పిస్తుంటాయి. ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర, సీఎన్జీ ధరలు, క్రెడిట్ కార్డు రూల్స్, జీఎస్టీ ఇలా వివిధ అంశాల్లో మార్పులు సాధారణం. సెప్టెంబర్ 1 నుంచి 5 కీలకమైన నిబంధనలు మారనున్నాయి. వీటి ప్రభావం నేరుగా మీ నెలసరి ఖర్చులపై పడనుంది.
ఆధార్ కార్డు అప్‌డేట్ విషయంలో సెప్టెంబర్ నుంచి కొత్త రూల్ వస్తోంది. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు చివరి గడువు సెప్టెంబర్ 14. ఆ తరువాత అప్‌డేట్ చేయాలంటే నిర్ధారిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14 వరకు మాత్రం ఉచితంగా పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయవచ్చు.
పెట్రోల్, డీజిల్ కాకుండా ఇతర ఇంధన ధరల్లో మార్పు రానుంది. ముఖ్యంగా ప్రతి నెలా 1వ తేదీన ఏవియేషన్ ఫ్యూయల్, సీఎన్జీ, పీఎన్జీ ధరలు మారుతుంటాయి. అదే విధంగా సెప్టెంబర్ 1న ఆయిల్ కంపెనీల సమీక్షలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు పెరగడం లేదా తగ్గడం చూడవచ్చు.
ఎల్పీజీ సిలెండర్ ధరలు కూడా ప్రతి నెలా పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. ఎల్పీజీ డొమెస్టిక్ అంటే 14 కేజీల సిలెండర్, కమర్షియల్ అంటే 19 కిలోల సిలెండర్ ధరలు ప్రతి నెలా 1వ తేదీన పెరగడమో లేదా తగ్గడమో జరుగుతుంటుంది. సెప్టెంబర్ 1న దీనిపై నిర్ణయం వెలువడనుంది.
జీఎస్టీలో కూడా మార్పు రానుంది. సరైన బ్యాంక్ ఎక్కౌంట్ ఇవ్వని జీఎస్టీ ట్యాక్స్ పేయర్లు జీఎస్‌టీఆర్ 1 రిటర్న్స్ సమర్పించేందుకు సాధ్యం కాదు. ఈ మార్పు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. జీఎస్టీ రూల్ 10ఏ ప్రకారం రిజిస్ట్రేషన్‌కు 30 రోజుల్లోగా సరైన బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. జీఎస్‌టీఆర్ 1 ఫామ్ ద్వారా వీటిని ఫైల్ చేయాలి.
ఇక సెప్టెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబందనలు అమల్లో రానున్నాయి. ముక్యంగా ఐడీఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు రూల్స్ మారనున్నాయి. ఐడీఎఫ్ సి క్రెడిట్ కార్డు మినిమం డ్యూ, చెల్లింపు తేదీ రెండూ మారనున్నాయి. అదే సమయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాయల్టీ ప్రోగ్రామ్ కూడా మారనుంది.
Also read: Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook