New Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న కొత్త నిబంధనలు ఇవే
New Rules: ప్రతి ఏటా ఆర్ధిక సంవత్సరం మారినప్పుడు కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తుంటాయి. ఈసారి కూడా కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి కొన్ని కీలకమైన అంశాల్లో రూల్స్ మారుతున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
New Rules: నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఫాస్టాగ్ కేవైసీ, ఈపీఎప్ఓ ఇలా చాలా విషయాల్లో కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ నియమాల గురించి తెలుసుకోకపోతే దైనందిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇందులో కొన్ని మార్చ్ 31 నాటికి పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి అవి కాస్తా డీయాక్టివ్ కావచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకానికి ఆధార్ బేస్డ్ ధృవీకరణ తప్పనిసరిగా చేయించుకోవల్సి ఉంటుంది. పీఎఫ్ఆర్డీఏ ఇక నుంచి ఎన్‌పీఎస్ ఎక్కౌంట్ లాగిన్ నియమాలు మార్చింది. కస్టమర్ ఎక్కౌంట్‌కు మరింత భద్రత చేకూర్చే క్రమంలో ఈ ఆధార్ ధృవీకరణ ప్రవేశపెట్టింది. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. అప్పుడే ఎన్‌పీఎస్ ఎక్కౌంట్ ఓపెన్ అవుతుంది.
ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్బీఐ ఆరమ్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ పల్స్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్ కార్జులపై రివార్డు పాయింట్లు ఇకపై ఉండవు. అంతేకాకుండా వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ పెరుగుతుంది.
ఈపీఎఫ్ఓ నిబంధనల్లో కూడా మార్పులు వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగం మారితే ఎక్కౌంట్ కూడా దానికదే మారిపోతుంటుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి న్యూ ట్యాక్స్ రెజీమ్ డీఫాల్ట్‌గా ఉంటుంది. అంటే ఏ ట్యాక్స్ విధానం కావాలో ఎంచుకోనప్పుడు ఆటోమేటిక్‌గా న్యూ ట్యాక్స్ విధానం వర్తిస్తుంది. కొత్త ట్యాక్స్ విధానంపై 7 లక్షల వరకూ ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఏప్రిల్ 1 వరకూ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ఎక్కౌంట్ కేవైసీ పూర్తి కాకుంటే ఆ ఎక్కౌంట్ డీయాక్టివ్ కాగలదు.
Also read: Best mutual funds: ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే.. మీ రాబడి 70 శాతం పెరగడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook