New Sim Card Rules: మొన్నటి వరకైతే సిమ్ కార్డు పోయినా లేక డ్యామేజ్ అయినా వెంటనే క్షణాల్లో కొత్త సిమ్ కార్డు లభించేది. మరోవైపు మొబైల్ నెంబర్ నెట్‌వర్క్ మార్చడం కూడా చాలా సులభంగా జరిగేది. కానీ జూలై 1 నుంచి సిమ్ కార్డు నిబంధనలు మారుతుండటంతో అంత సులభం కాదిక. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిమ్ కార్డు, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ విషయంలో కొత్త నిబంధనలు వచ్చి చేరాయి. ఇవి జూలై 1 నుంచి అమలు కానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం సిమ్ కార్డు పోగొట్టుుకుంటే వెంటనే లభించదు. 7 రోజులు ఆగాల్సిందే. పాత సిమ్ కార్డు డ్యామేజ్ అయినా లేక పోగొట్టుకున్నా కొత్తది తీసుకోవాలంటే లాకింగ్ పీరియడ్ 7 రోజులు ఆగాల్సిందేనంటోంది ట్రాయ్. అదే విధంగా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ విషయంలో కూడా మార్పులు చేర్పులు చేసింది. స్విమ్ స్వాప్ , ఇతర మోసాల్ని అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తెచ్చింది. 


సిమ్ కార్డు పోయినా లేక డ్యామేజ్ అయినా ఇక నుంచి కస్టమర్లు కొద్దిగా వేచి చూడాల్సి ఉంటుంది. నిన్న మొన్నటి వరకైతే సిమ్ కార్డు పోతే వెంటనే క్షణాల్లో ఆధార్ కార్డు వెరిఫికేషన్ సహాయంతో వెంటనే పొందే వీలుండేది. కానీ ఇప్పుడిక 7 రోజులు ఆగాలి. ఆ తరువాతే కొత్త సిమ్ కార్డు లభిస్తుంది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనల్లో మార్పులొచ్చాయి. ఇవి కూడా జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రాయ్ ప్రకారం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సౌకర్యం కస్టమర్‌కు ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు బదిలీ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ప్రక్రియను మెరుగుపర్చేందుకు ఎప్పటికప్పుడు ట్రాయ్ 8 సార్లు నిబందనల్లో మార్పులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు మరో కొత్త మార్పు చేసింది. పోర్టింగ్ కోడ్ విజ్ఞప్తిని తిరస్కరించే వెసులుబాటును కంపెనీలకు ట్రాయ్ కల్పించింది. మోసం, చీటింగ్ నియంత్రణకై ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. చాలా కేసుల్లో సిమ్ కార్డు పోయిన తరువాత మరో సిమ్ కార్డులో యాక్టివేట్ అయిన సందర్భాలు వెలుగుచూశాయి.


అందుకే కొత్త నిబంధనల్లో యూనిక్ పోర్టింగ్ కోడ్ విజ్ఞప్తిని తిరస్కరించే హక్కును కంపెనీలకు కల్పించింది ట్రాయ్. సిమ్ కార్డు రీప్లేస్ చేసిన వారం రోజుల్లో యూనిక్ పోర్టింగ్ కోడ్ విజ్ఞప్తి ఉంటే తిరస్కరించవచ్చు. స్విమ్ కార్డు స్వాప్ లేదా రీప్లేస్‌మెంట్‌కు గడువుకు 7 రోజుల ముందు చేసే యూపీసీ రిక్వెస్ట్  తిరస్కరించే అవకాశముంది.


Also read: Jio Recharge Plan: రిలయన్స్ జియోలో ఏ ప్లాన్ ఎంత పెరిగింది, ఎప్పట్నించి అమలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook