Income Tax Saving Schemes: మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తుంటే.. సరైన మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. సరిగ్గా ప్లాన్ చేసుకుని పెట్టుబడి పెడితే.. భారీ లాభాలతో పాటు ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి, జీవిత బీమా ప్రీమియం, ఎడ్యుకేషన్ ఫీజులు, హౌస్ లోన్ చెల్లింపు మొదలైన వాటిపై సెక్షన్ 80సీ కింద మీరు రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. ఆదాయపు పన్ను దాఖలు ప్రక్రియ కూడా ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కాబోతుంది. మీరు కూడా పాత పన్ను విధానంలో పన్ను దాఖలు చేస్తుంటే.. మార్చి నెలలోనే ఓ పథకంలో పెట్టుబడి పెట్టి.. మీ ట్యాక్స్‌ను సేవ్ చేసుకోండి. 
 
ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో పీపీఎఫ్‌ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టి ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500 నుంచి గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ 15 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. ఏటా 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. అలాగే ఈ పథకం కింద అందుకున్న మొత్తం, పెట్టుబడి మొత్తంపై పన్ను ఆదా అవుతుంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టి రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను ఆదా చేసుకోండి. పీపీఎఫ్‌ కాకుండా ఎన్‌ఎస్‌సీ, ఎస్ఎస్‌వై, ఎస్‌సీఎస్‌ఎస్‌ వంటి పథకాల్లో కూడా బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకాలు ఇన్వెస్టర్లకు ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయాన్ని ఇస్తాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) ద్వారా ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఎంపిక. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్‌లు తమ ఆస్తులలో 80 శాతం నుంచి 100 శాతం వరకు కంపెనీల ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెడతాయి. దీంతో మార్కెట్ రిస్క్‌లకు గురవుతాయి. అయితే వీటిలో 3 సంవత్సరాల లాక్ ఇన్ పిరియడ్ ఉంది.


నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తరువాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్‌పీఎస్‌కు కంట్రిబ్యూషన్ చేసే వ్యక్తులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద మినహాయింపు పొందవచ్చు. 


ఫిక్స్‌డ్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్‌లకు, రిస్క్ వద్దనుకునే ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలో పెట్టుబడి పెడితే.. సెక్షన్ 80సీ కింద  ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. దీని కాలవ్యవధి 5 ​​సంవత్సరాలు ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ పథకాలలో ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ సేవ్ చేసుకోండి.


Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!  


Also Read: Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook