New Rules: కొత్త ఏడాదిలో మారనున్న నిబంధనలు.. పూర్తి వివరాలు ఇవిగో..
New Rules From 1st January 2023: కొత్త ఏడాది సరికొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. పోస్టాఫీసు స్కీమ్‌లో పెంచిన వడ్డీ రేట్లు రేపటి నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా..
New Rules From 1st January 2023: మరికొన్ని గంటల్లో 2022 సంవత్సరం ముగియనుంది. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువత పార్టీలకు రెడీ అయిపోయారు. శనివారం అర్ధరాత్రి హ్యాపీ న్యూయర్ అంటూ మార్మోగనుంది. ఇక కొత్త సంవత్సరంలో కొత్త నిబంధనలు కూడా అమలులోకి రానున్నాయి.
జనవరి 1 నుంచి బ్యాంకింగ్, బీమా, పోస్టాఫీసు మొదలైన అనేక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకుబోతున్నాయి. 2023 సంవత్సరంలో వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. రేపటి నుంచి వాహనాల ధరలు పెరగనున్నాయి. దీంతో పాటు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో ఉపసంహరణ నిబంధనలలో మార్పు రానుంది. ఇకనుంచి మీకు ఆన్‌లైన్ పాక్షిక ఉపసంహరణ సౌకర్యం ఉండదు.
పోస్టాఫీసు పథకంలో పెరిగిన వడ్డీ రేట్లు
కొత్త సంవత్సరం ప్రారంభం కానుండడంతో పోస్టాఫీసు పథకాల వడ్డీరేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఎస్‌సీ, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ల వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ పెంపుదల 20 నుంచి 110 బేసిస్ పాయింట్లకు పెరిగింది. దీంతో పాటు కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. రేపటి నుంచి ఈ రేట్లు అమలులోకి రానున్నాయి.
వాహనాలు మరింత ఖరీదు..
మీరు కొత్త సంవత్సరంలో కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. మరింత భారం పడే అవకాశం ఉంది. మారుతీ, కియా, టాటా మోటార్స్, మెర్సిడెస్, హ్యుందాయ్, ఆడి, రెనాల్ట్, ఎంజీ మోటార్స్ వంటి దాదాపు దేశంలోని ప్రతి ప్రధాన కార్ల తయారీ సంస్థలు తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కొత్త రేట్లు జనవరి 1, 2023 నుంచి వర్తిస్తాయి.
సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరల్లో మార్పు
నెల ప్రారంభంలో ప్రభుత్వ చమురు కంపెనీలు దేశంలోని అనేక నగరాల్లో సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలను మారుస్తాయి. నవంబర్ 2022లో వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించడం గమనార్హం. మరోవైపు ఢిల్లీ, ముంబైలలో గత కొన్ని నెలలుగా సీఎన్‌జీ-పీఎన్‌జీధరలలో నిరంతర పెరుగుదల నమోదైంది.
లాకర్ నియమాలు కూడా..
రేపటి నుంచి లాకర్ రూల్స్‌లో కూడా మార్పులు రానున్నాయి. కొత్త లాకర్ నిబంధనలపై సంతకం చేశారా లేదా అని బ్యాంకు, ఖాతాదారులు కలిసి నిర్ధారించుకోవాలి. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత లాకర్‌లో ఉంచిన వస్తువులు పోగొట్టుకుంటే బ్యాంకుదే బాధ్యత వహిస్తుంది. దీంతో పాటు లాకర్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బ్యాంకు ఖాతాదారులకు తెలియజేయాలి.
జీఎస్‌టీ ఎలక్ట్రానిక్ బిల్లు అవసరం
జనవరి 1, 2023 నుంచి జీఎస్‌టీ నియమాలలో కీలక మార్పు రాబోతోంది. ఇప్పుడు 5 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం చేసే వ్యాపారులకు ఈ-ఇన్‌వాయిస్ అంటే ఎలక్ట్రానిక్ బిల్లు తప్పనిసరి. ఇంతకుముందు ఈ పరిమితి రూ.20 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.5 కోట్లకు తగ్గించారు.
ఎన్‌పీఎస్ ఖాతా నుంచి పాక్షిక ఉపసంహరణ బంద్
ఎన్‌పీఎస్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణ నిబంధనలలో మార్పు రానుంది. ఇప్పుడు మీరు ఎన్‌పీఎస్ ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేయలేరు. జనవరి 1, 2023 నుంచి రాష్ట్ర ఉద్యోగులు లేదా కేంద్ర ఉద్యోగులు NPS ఖాతా నుండి విత్‌డ్రా చేయలేరు. కరోనా మహమ్మారి దృష్ట్యా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఆన్‌లైన్‌లో ఉపసంహరణ సదుపాయాన్ని అందించింది. ఇప్పుడు అది ఉపసంహరించనున్నారు.
Also Read: Team India: ఈ ఏడాది టెస్టుల్లో బెస్ట్ ప్లేయర్లు వీరే.. బీసీసీఐ ప్రకటన
Also Read: Budh Margi 2023: బుధుని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారు కొత్త సంవత్సరంలో నోట్ల కట్టలతో ఆడుకుంటారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి