Stock Market: లాభాల్లో మార్కెట్లు.. ఆల్ టైమ్ హై రికార్డ్‌ను క్రాస్ చేసిన సెన్సెక్స్..గరిష్ట స్థాయికి నిఫ్టీ..!!
Share Market Today:సోమవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 397.41 పాయింట్ల లాభంతో 81,730.13 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 125.70 పాయింట్లు లాభపడి 24,960.55 పాయింట్లకు చేరుకుంది.
Share Markets Updates Today: సోమవారం దేశీయ మార్కెట్ల మంచి లాభాలతో షురూ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డుల వద్ద ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడ్‌లో సెన్సెక్స్ 397.41 పాయింట్లు పెరిగి 81,730.13 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 125.70 పాయింట్లు లాభపడి 24,960.55 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ చారిత్రక స్థాయి 25 వేలను తాకవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఈ స్థాయిని బ్రేక్ చేస్తే 25,400 స్థాయిని చూడొచ్చు.షేర్ల గురించి తెలుసుకుంటే,ఎన్టీపీసీ(NTPC), ఇండస్ ఇండ్ (IndusInd) బ్యాంక్, ఐసీఐసీఐ (ICICI)బ్యాంక్, ఎస్బీఐ (SBI), ఇన్ఫోసిస్, రిలయన్స్ ,టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ మొదలైన వాటిలో మంచి వృద్ధి కనిపిస్తోంది.ఇక టైటాన్, భారతీ ఎయిర్ టెక్, టెక్ మహీంద్రా, ఐటీసీ, పవర్ గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
రేట్ల కోత అంచనాలతో అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగించేశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం నేడు సానుకూలంగానే ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర రూ. 81.30 డాలర్ల వద్ద కొనసాగుతుండగా..విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం నికరంగా రూ. 2,546 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
దేశీయ సంస్థాగత మదుపర్లు కూడా రూ. 2,774కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. కాగా ఈ జులై 30-31 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వే సమావేశం జరగనుంది. ఈసారి వడ్డీ రేట్లు మాత్రం యథాతథంగానే ఉండే చాన్స్ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ వారం ఓలా ఎలక్ట్రిక్ తో కలిపి 3 ప్రధాన ఐపీఓలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter