NPS Vatsalya: చిన్నారుల కోసం కొత్త పొదుపు పథకం వాత్సల్య..ఎలా పొదుపు చేయాలి?పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?
What is NPS Vatsalya Scheme: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024ను ప్రవేశపెడుతూ..చిన్నారులకోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఈ బడ్జెట్ లో పలు అంశాలను ప్రస్తావిస్తూ..ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం గురించి వెల్లడించారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు, సంరక్షకుల సహకారం కోసం ఎన్‌పిఎస్-వాత్సల్య రూపంలో ఒక పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో ఎలా పొదుపు చేయాలి?పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?పూర్తి వివరాలు తెలుసుకుందాం.
NPS Vatsalya: 2024 బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇది చిన్నారుల భవిష్యత్తును పటిష్టం చేసుకోవడానికి వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చేపట్టగలిగే దీర్ఘకాలిక పొదుపు పథకం.ఈ పథకంలో పిల్లల పేరు మీద పాలసీలు తీసుకోవచ్చు. అంతేకాదు పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.పిల్లలు మెజారిటీ వయస్సు వచ్చిన తర్వాత ఈ పథకాన్ని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్ పాలసీగా మార్చవచ్చు.
పిల్లల భవిష్యత్తును బలోపేతం చేసుకునేందుకు ఇది కొత్త పథకం. నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద పిల్లలకు కొంత డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. ఇందుకోసం పోస్టాఫీసు లేదా జాతీయ బ్యాంకులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) కింద వాత్సల్య ఖాతాను తెరవాల్సి ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు ప్రతి నెలా లేదా నిర్దిష్ట వ్యవధిలో ఈ ఖాతాకు డబ్బు బదిలీ చేయడం ద్వారా ఈ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న NPS స్కీమ్ మాదిరిగానే పని చేసినప్పటికీ, ఈ పథకం 18 ఏళ్లలోపు స్కీమ్ అయినందున కొంత భిన్నంగా ఉంటుంది.ముందే చెప్పినట్లుగా,పిల్లలు మెజారిటీ వయస్సు వచ్చిన తర్వాత ఈ పథకాన్ని సాధారణ NPS ఖాతాగా మార్చవచ్చు.అంటే, ఒకసారి దీనిని సాధారణ NPS పథకంగా మార్చుకోవచ్చు.
Also Read :Budget 2024: బడ్జెట్ వేళ.. తెల్ల చీరలో మెరిసిన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ..!!
ఈ పథకం వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
ఈ పథకం కింద పిల్లలకు ప్రారంభంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. సాధారణంగా ఎన్ పీఎస్ లో పెట్టుబడి పెట్టడం 18ఏండ్ల నుంచి 65ఏండ్ల వరకు లేదా రిటైర్ మెంట్ వరకు ఉంటుంది. 70ఏండ్ల వరకు అకౌంట్ ను కంటిన్యూ చేసుకోవచ్చు. ఎన్ పీఎస్ కింద రిటైర్ మెంట్ అయిన తర్వాత మెచ్యూరిటీ సమయంలో లేదా 60ఏండ్ల వయస్సు వచ్చినప్పుడు ఉద్యోగి మొత్తం ఫండ్ లో కనీసం 40శాతంతో యాన్యుటీప్లాన్ తీసుకోవాలి. ఈ ఫండ్ లో 60శాతం మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులో సాధారణంగా ఇతర పొదుపు పథకాల కంటే ప్రభుత్వం అందించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇందులో పెట్టుబడి పెడితే లాభం ఎక్కువ.
పన్ను మినహాయింపు:
సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి పన్ను మినహాయింపు సౌకర్యం లభిస్తుంది. వాత్సల్య యోజనలో చేసే పెట్టుబడులకు కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. పెట్టుబడిపై పన్నును తప్పించుకోవచ్చు.
Also Read : Union Budget: బడ్జెట్‌లో యువతకు గుడ్‌న్యూస్? కేంద్ర బడ్జెట్‌తో స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా తగ్గుదల?
భద్రత:
సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉంటుందని చాలా మంది నమ్మకం. NPS వాత్సల్య యోజన కూడా ప్రభుత్వ పథకం కాబట్టి మీరు ఇక్కడ పెట్టుబడి పెడితే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి, పెట్టుబడికి హామీ ఉంటుంది.ఇక్కడ పెట్టుబడి పెట్టిన డబ్బును ప్రభుత్వం సెక్యూరిటీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంది.ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం కాబట్టి వినియోగదారులకు ఎలాంటి ప్రభావం చూపదు.
Disclaimer: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ న్యూస్ వెబ్ పోర్టల్ ఎలాంటి ఆర్థిక సలహాలు ఇవ్వదు. మీరు డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులు సలహా తీసుకోవడం తప్పనిసరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter