Aadhaar card: ఏటీఎం కార్డు లాంటి ఆధార్ కోసం ఇలా అప్లై చేసుకోండి
Aadhaar card new form like ATM card in wallet Apply this way : ఇప్పటి వరకు ప్రింట్ వెర్షన్లో పేపర్ ఆధార్ కార్డు మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దాన్నే మనలో కొందరు చిన్న సైజ్‌లో చేసుకుని ఉపయోగిస్తుంటాం.
Aadhaar card will come in new form like ATM card in wallet Apply this way : మన దగ్గర ఎప్పుడూ ఉండేవాటిలో ఆధార్ కార్డు (Aadhaar card) కూడా ఒకటి. దాన్ని జేబులో లేదా పర్సులో ఎప్పుడూ మన వద్దే ఉంచుకుంటాం. ఇప్పటి వరకు ప్రింట్ వెర్షన్లో పేపర్ ఆధార్ కార్డు (print version aadhar card) మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దాన్నే మనలో కొందరు చిన్న సైజ్‌లో చేసుకుని ఉపయోగిస్తుంటాం.అయితే ఆధార్‌కు కొత్త రూపునిస్తోంది యూఐడీఏఐ. 2021లో సరికొత్తగా పీవీసీ ఆధార్‌ను ప్రవేశపెట్టింది.
ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్లను జారీ చేస్తోంది యూఐడీఏఐ (uidai). కేవలం రూ.50 చెల్లిస్తే ఈ పీవీసీ కార్డును మనం పొందవచ్చు. కార్డులో పేర్కొన్న అడ్రస్‌కే పీవీసీ ఆధార్ కార్డును (pvc aadhar card) డెలివరీ అవుతుంది. మరి ఈ ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్ కోసం చాలా సింప్లీ స్టెప్స్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : MAA Elections 2021: మంచువిష్ణుకు బాలకృష్ణ మద్దతు
మొదట యూఐడీఏఐ వెబ్సైట్(https://myaadhaar.uidai.gov.in/)కి వెళ్లి లాగిన్ అవాలి. తర్వాత 'ఆర్డర్ ది పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు మీ వివరాలు కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి..తర్వాత రూ.50 చెల్లిస్తే చాలు. ఆధార్ కార్డులో (Aadhaar card) ఉన్న అడ్రెస్‌కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది. ఇలా సింపిల్ స్టెప్స్‌తో ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్‌ను పొందొచ్చు.
Also Read : అక్కడ కిలో ఉప్పు రూ.130, కిలో చక్కెర రూ.150..కారణం ఏంటంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి