How to get 2.5 Lakhs Pension: రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈ పథకంలో చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ నాటికి ఏకంగా 5 కోట్ల రూపాయలు కూడబెట్టవచ్చు. పెన్షన్ నెలకు 2.5 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పధకంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తరువాత నెలకు ఏకంగా 2.5 లక్షల రూపాయలు అందుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..నిజమే మరి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములా గురించి పూర్తిగా తెలుసుకుందాం. అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్. రిటైర్మెంట్ తరువాత ఏకంగా 5 కోట్లు కూడబెట్టవచ్చు. అదెలాగంటే..రిటైర్మెంట్ సెక్యూరిటీ కోసం ఎప్పుడూ యక్త వయస్సులో ఉన్నప్పుడే ఆలోచించాలి. ఎంత మొత్తం నగదు అవసరమౌతుంది, ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది సరిగ్గా నిర్ణయించుకోవాలి. దీనికోసం బెస్ట్ ఆప్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇందులో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ పోతే రిటైర్మెంట్ నాటికి 5 కోట్లు జమ చేయవచ్చు. నెలకు 2.5 లక్,ల రూపాయలు పెన్షన్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. యుక్త వయస్సులో ఎన్‌పీఎస్ ప్రారంభిస్తేనే ఇది సాధ్యమౌతుంది. 


అంటే మీకు ఒకవేళ రిటైర్మెంట్ నాటికి 5 కోట్లు కావల్సి వస్తే 25 ఏళ్ల వయస్సు నాటికి ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాలి. ఈ వయస్సులో రోజుకు 442 రూపాయలు నేషనల్ పెన్షన్ సిస్టమ్ పధకంలో ఇన్వెస్ట్ చేస్తుంటే రిటైర్ అయ్యేనాటికి చాలా సులభంగా 5 కోట్లు జమ చేయవచ్చు. రోజుకు 442 రూపాయలు అంటే నెలకు 13,260 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 35 ఏళ్ల పాటు ఇలా సేవ్ చేయాలి. సరాసరిన 10 శాతం వడ్డీ అందుతుంది. అంటే 60 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా 5.12 కోట్లు అవుతుంది. నెలకు 13,260 రూపాయల చొప్పున 35 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 56,70,200 రూపాయలు అవుతుంది. ఈ పధకంలో కాంపౌండ్ వడ్డీ వర్తిస్తుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే 56.70 లక్షలకు మీరు పొందే వడ్డీ ఒక్కటే 4.55 కోట్లు అవుతుంది. అంటే మొత్తం మీద 5.12 కోట్లు లభిస్తాయి. 


రిటైర్ అయ్యేనాటికి మొత్తం 5.12 కోట్లలో 60 శాతం విత్ డ్రా చేయవచ్చు. అంటే 3 కోట్లు రూపాయలు మీరు డ్రా చేసుకోగలరు. మిగిలిన 2 కోట్ల రూపాయలు యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ అవుతాయి. ఈ 2 కోట్ల రూపాయలపై జీవితాంతం మీకు ప్రతి నెలా డబ్బులు వస్తుంటాయి. ఎన్‌పీఎస్ అనేది మీకు 60 ఏళ్లు వచ్చినప్పుడే మెచ్యూర్ అవుతుంది. అంటే అంతకంటే ముందు మీరు విత్ డ్రా చేసుకోలేరు. ఏదైనా అత్యవసరం అంటే అనారోగ్యం, ఇంటి నిర్మాణం, పిల్లల చదువు కోసం కొంతమొత్తం విత్ డ్రా చేయవచ్చు. 


అయితే మొత్తం నగదు అంటే 5.12 కోట్లను యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ 5-6 శాతం అందుతుంది. అంటే 5.12 కోట్లపై ఏడాదికి 25.60 లక్షల నుంచి 30.72 లక్షలు వస్తుంది. నెలకు లెక్కేస్తే 2.13 లక్షల నుంచి 2.56 లక్షలు తీసుకోవచ్చు. 


Also read: 8th Pay Commission: ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరుగుతున్నాయంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.