LPG Gas Cylinder Price Hike: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు షాక్, మరోసారి పెరిగిన సిలెండర్ ధర
LPG Gas Cylinder Price Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్. ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలెండర్ ధరల్ని అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కొక్క సిలెండర్ 101 రూపాయలు పెరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LPG Gas Cylinder Price Hike: దేశంలో గ్యాస్ ధరలు అంతకంతకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరల్ని మరోసారి పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ సిలెండర్ ధరను ఏకంగా 101.50 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించాయి.
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను 101.50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ఇవాళ అంటే నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. గత రెండు నెలల వ్యవధిలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పెరగడం రెండవసారి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలో ఏ మార్పు లేకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.
పెరిగిన కొత్త ధరలప్రకారం ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ 1731 రూపాయల్నించి 1833 రూపాయలకు చేరుకుంది. కోల్‌కతాలో 1943 రూపాయలు, బెంగళూరులో 1914.50 రూపాయలు, చెన్నైలో 1999.50 రూపాయలకు పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు కలిసి ప్రతి నెలా గ్యాస్ ధరల్ని సమీక్షిస్తూ పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటాయి. కానీ చాలాకాలంగా పెరగడమే గానీ తగ్గించిన పరిస్థితి లేదు.
డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ 14.2 కిలోల ధర కోల్‌కతాలో 929 రూపాయలు కాగా ముంబైలో 902.50 రూపాయలు, చెన్నైలో 918.50 రూపాయలు, ఢిల్లీలో 903 రూపాయలుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలోని వ్యాట్ ఇతర ట్యాక్స్ ఆధారంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసముంటుంది. ఏదైనా సరే రాష్ట్రం నుంచి రాష్ట్రానికి గ్యాస్ ధరల్లో 20-30 రూపాయల్లోపే వ్యత్యాసం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook