Okaya Electric Scooter: దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాలకు రోజురోజుకి డిమాండ్​ పెరుగుతోంది. దీంతో ఈ మార్కెట్​ను క్యాష్​ చేసుకునేందుకు పలు ఆటో కంపెనీలు పోటీపోటీగా ఇ-స్కూటర్లను (e-scooter) విడుదల చేస్తున్నాయి. వీటితో పాటు కొత్త స్టార్టప్​ సంస్థలు కూడా ఇందులో అడుగుపెడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఎనర్జీ సొల్యూషన్స్​ ప్రొవైడర్​ ఒకాయా గ్రూప్​ ఫ్రీడమ్​ (Freedum e-scooter) పేరుతో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ను లాంచ్​ చేసింది. దీని ధరను రూ. 69,900 గా నిర్ణయించింది. ఒకాయా ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్​లో విక్రయిస్తోంది. అవియోన్ ఐక్యూ సిరీస్, క్లాస్ఐక్యూ సిరీస్ పేర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి. తాజాగా మూడవ ఉత్పత్తిగా విడుదలైన ఫ్రీడమ్ మోడల్​​ లిథియం అయాన్, లెడ్​ యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది.


Also Read: Ola scooters: ఇ-కామర్స్ చరిత్రలో 'ఓలా' సరికొత్త రికార్డు...రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు అమ్మకాలు..


ఒక్కో ఛార్జ్ కు గరిష్టంగా 250 కిలోమీటర్లు..
హిమాచల్​ ప్రదేశ్​లోని బద్ది తయారీ యూనిట్​లో దీన్ని రూపొందించినట్లు ఒకాయా​ వెల్లడించింది. ఈ కొత్త మోడల్​ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో లో స్పీడ్​, హై స్పీడ్ ట్రిమ్​ వేరియంట్లు కూడా ఉంటాయి. ఈ స్కూటర్లు ఒక్కో ఛార్జ్​కి గరిష్టంగా 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఈ కొత్త స్కూటర్​ లాంచింగ్​​పై ఒకాయా పవర్​ గ్రూప్​ మేనేజింగ్​ డైరెక్టర్​ అనిల్​ గుప్తా మాట్లాడుతూ “ భారత్​లో ఎలక్ట్రిక్ మార్కెట్​ ఆశాజనకంగా ఉంది. ఈ మార్కెట్​ భవిష్యత్తులో మరింత వృద్ధి చెందనుంది. ప్రతి భారతీయుడికి తాము పెట్టిన డబ్బకు అధిక నాణ్యత, విలువను అందించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఇప్పటికే ఎనర్జీ సొల్యూషన్స్​ వ్యాపారంలో ఉన్నందున ఈ–మార్కెట్​లో మాకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నాం” అని చెప్పారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హై-స్పీడ్ మోటార్‌సైకిల్, ప్రత్యేక B2B వాహనాలతో సహా 14 కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 120 డీలర్​షిప్​ సెంటర్ల ద్వారా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో మరో 800 డీలర్​షిప్​ సెంటర్లను ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది.


ఓలాకు గట్టిపోటీ..
జులై నెలలో ఓలా(OLA) కంపెనీ తన మొదటి ఇ-స్కూటర్​ను లాంచ్​ చేయగా.. కేవలం 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్స్​ సాధించి రికార్డు నెలకొల్సింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా బుక్​ చేసుకున్న స్కూటర్​గా నిలిచింది. తాజాగా విడుదలైన ఒకాయా ఫ్రీడమ్​ ఇ-స్కూటర్​ ఓలా ఎస్​1, ఎస్​1 ప్రో వేరియంట్లకు గట్టి పోటీనివ్వనుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook