Ola electric scooter sale: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ప్రారంభం.. రూ. 499తో స్కూటర్‌ని రిజర్వ్ చేసుకునే అవకాశం, సబ్సిడీ వల్ల ధరలో భారీ వ్యత్యాసం
ఓలా స్కూటర్ బుకింగ్ ఆల్రెడీ మొదలైంది. రూ. 499 టోకెన్ మొత్తాన్ని కట్టి స్కూటర్‌ని బుక్ చేసుకోవచ్చు స్కూటర్‌ని రిజర్వ్ చేసుకున్న కస్టమర్‌లు మిగిలిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలుగా మార్చుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు బుధవారం నుంచి విక్రయానికి వచ్చాయి. ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ని 2 వేరియంట్‌లలో ఎస్1, ఎస్1 ప్రోలను వరుసగా రూ. 99,999, రూ. 1,29,999 వద్ద విడుదల చేసింది.
Ola S1 And S1 Pro Finally Goes On Sale : ఓలా స్కూటర్ బుకింగ్ ఆల్రెడీ మొదలైంది. రూ. 499 టోకెన్ మొత్తాన్ని కట్టి స్కూటర్‌ని బుక్ చేసుకోవచ్చు స్కూటర్‌ని రిజర్వ్ చేసుకున్న కస్టమర్‌లు మిగిలిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలుగా మార్చుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు బుధవారం నుంచి విక్రయానికి వచ్చాయి. ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ని 2 వేరియంట్‌లలో ఎస్1, ఎస్1 ప్రోలను వరుసగా రూ. 99,999, రూ. 1,29,999 వద్ద విడుదల చేసింది. అయితే రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలను బట్టి వీటి ధర మారుతుంది. అయితే కేంద్రం తీసుకువచ్చిన FAME-II పథకం కింద ఈ స్కూటర్‌లపై (e scooters) దాదాపుగా రూ .50,000 వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. జూన్‌లో, కేంద్రం FAME-II పథకాన్ని సవరించింది, విద్యుత్ ద్విచక్ర వాహన ప్రోత్సాహకాన్ని kWh కి రూ .15,000 పెంచింది (గతంలో ఇది రూ. 10,000గా ఉండేది). సబ్సిడీ పరిమితిని ద్విచక్ర వాహన ధరలో 40 శాతానికి రెట్టింపు చేసింది. అంటే రూ. 1.50 లక్షల వరకు ఎక్స్-ఫ్యాక్టరీ ధర కలిగిన ఏదైనా ఇ-టూ-వీలర్‌కు 4 kWh బ్యాటరీ ఉంటే గరిష్టంగా రూ .60,000 FAME-II సబ్సిడీకి అర్హులు. దాని సామర్థ్యాన్ని బట్టి, ఓలా ఎస్ 1 ప్రో దాదాపు 51,000-52,000 రూపాయల FAME-II ప్రోత్సాహకానికి అర్హత పొందే అవకాశం ఉంది.
రూ. 2,999 నుండి ప్రారంభం
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ పూర్తి చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. నచ్చిన స్కూటర్‌ని రూ. 499 టోకెన్ మొత్తాన్ని కట్టి స్కూటర్‌ని బుక్ చేసుకోవచ్చు. కొనుగోలు చేయదలిచిన వేరియంట్‌ను ఖరారు చేసిన తర్వాత అందుబాటులో ఉన్న రంగులలో ఒక రంగు స్కూటర్‌ను ఎంచుకోవచ్చు. తర్వాత మీరు ఎంచుకున్న వేరియంట్‌ని బట్టి, మీరు ఇపుడు మీ బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. స్కూటర్‌కు ఫైనాన్స్ కావాల్సి వస్తే ఓలా `ఎస్1` (Ola S1) స్కూటర్ కోసం నెలవారీ వాయిదా రూ. 2,999 నుండి ప్రారంభమవుతాయి. ఓలా ఎస్1 ప్రో ( Ola S1 Pro) కోసం నెల ఈఎమ్ఐలు రూ. 13,199 నుండి ప్రారంభమవుతాయి.
Also Read : Covid Vaccination:కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రికార్డు సృష్టించిన భారత్, ప్రపంచంలోనే అత్యధికంగా టీకాల పంపిణీ
డోర్ టు డెలవరీ
స్కూటర్‌కు ఫైనాన్సింగ్ కోసం ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, (HDFC)టాటా క్యాపిటల్‌తో సహా ప్రముఖ బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా.. ఓలా, ఓలా ఎలక్ట్రిక్ యాప్‌లలో అర్హత కలిగిన కస్టమర్లకు నిమిషాల్లో ప్రీ-అప్రూవ్డ్ లోన్ లభిస్తుంది. ఫైనాన్సింగ్ అవసరం లేకుంటే ఓలా ఎస్1 కోసం రూ. రూ. 20,000, ఓలా ఎస్1 ప్రో కోసం రూ. రూ. 25,000 అడ్వాన్స్‌గా చెల్లించవచ్చు. మిగిలిన మొత్తాన్ని కంపెనీ ఇన్వాయిస్ చేసినపుడు చెల్లించొచ్చు. అక్టోబర్‌లో (october) ఈ స్కూటర్ల డెలివరీలు ప్రారంభమవుతాయి. స్కూటర్ డెలివరీ.. డోర్ టు డెలవరీ ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ (Ola electric scooter) ప్రీ బుకింగ్స్ జులైలో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌లోకి స్కూటర్ రాకముందే లక్షకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 8న ఈ స్కూటర్ అమ్మకాలు ఆన్‌లైన్‌లో ప్రారంభమైనా.. టెక్నికల్ ఇష్యూస్ వల్ల వారం రోజుల పాటు అమ్మకాలు వాయిదా వేశారు. ఇక నేటి నుంచి ఆన్‌లైన్ వేదికగా అమ్మకాలు మొదలయ్యాయి.
Also Read : Flipkart New Offer: భారీగా పెరిగిన ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పరిమితి, ఎలా పొందాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook