Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై రూ. 16 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్స్
Ola Electric Scooters: ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ. 1.27 లక్షలుగా ఉంది. అలాగే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.08 లక్షలుగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ శ్రేణిలోకి కొత్తగా ఓలా S1 Air స్కూటర్ వచ్చి చేరుతోంది.
Ola Electric Scooters: హోలీ పండగ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బంపర్ ఆఫర్స్ అందిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వారికి రూ. 16 వేలు వరకు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండగా.. మరో రూ. 7 వేల వరకు ఇతరత్రా ప్రయోజనాలు అందిస్తోంది. తమిళనాడులోని సొంత ప్లాంట్ నుంచి S1, S1 Pro, S1 Air మోడల్స్ పేరిట మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారు చేసి విక్రయిస్తున్న ఓలా కంపెనీ.. హోలీ 2023 పండగను పురస్కరించుకుని తమ కస్టమర్స్ సంఖ్యను పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆఫర్స్ ఇచ్చి మరీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ విక్రయించడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్స్ శ్రేణిలో తమ మార్కెట్ వాటా పెంచుకోవచ్చనేది ఓలా ఆలోచనగా తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనుగోలు చేసే కస్టమర్స్ కి ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 8 నుంచి మార్చి 12వ తేదీ వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ. 1.27 లక్షలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ. 12 వేలు డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుండగా.. మరో రూ. 4 వేలు ఎక్స్‌చేంజ్ బోనస్ కింద అందిస్తోంది.
అలాగే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.08 లక్షలుగా ఉండగా.. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ 2 వేలు డిస్కౌంట్ అందిస్తున్నారు. 3Kwh లార్జర్ బ్యాటరీ కలిగిన వాహనాలపై మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇదే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ 2kwh బ్యాటరీ కలిగిన వాహనాలపై డిస్కౌంట్ కాకుండా ఎక్స్ చేంజ్ బోనస్ రూపంలో రూ. 2 వేలు అందిస్తున్నారు. ఇవేకాకుండా ఓలా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లలో ఓలా సేవలు ఉపయోగించుకునేలా మరో రూ. 7 వేల విలువైన అదనపు ఆఫర్స్ అందిస్తున్నారు. ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్, అదనపు వారంటి వంటి బెనిఫిట్స్ అందిస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ శ్రేణిలోకి కొత్తగా ఓలా S1 Air స్కూటర్ వచ్చి చేరుతోంది. సింగిల్ చార్జింగ్‌తో 100 కిమీ రేంజ్ ఇచ్చే కెపాసిటీ ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం. 4.5kw కెపాసిటీ మోటార్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. 90 కిమీ టాప్ స్పీడ్‌లో దూసుకుపోగలదు.
ఇది కూడా చదవండి : Hyundai Alcazar 2023: హ్యూందాయ్ నుంచి సూపర్ పవర్‌ఫుల్ కారు వచ్చేసింది
ఇది కూడా చదవండి : Maruti to Mahindra: ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయంటే..
ఇది కూడా చదవండి : Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo