Ola E-scooter Fire: ఓలా ఈ-స్కూటర్లో మంటలు- వైరల్ అవుతున్న వీడియో..
Ola E-scooter Fire: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పుణేలో ఓలాకు చెందిన ఈ-స్కూటర్ మంటల్లో కాలిపోయింద. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో.. కంపెనీ అధికారికంగా స్పందించింది.
Ola E-scooter Fire: తమ ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగిన ఘటనపై.. ఓలా స్పందించింది. ఆ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వివరించిచింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జనం.. చర్చ సాగుతున్న నేపథ్యంలో కంపెనీ కూడా అధికారిక ప్రకటన చేసింది. ఘటనపై విచారణ జరుగుతున్నట్లు తెలిపింది.
ఇంతకీ ఏమైందంటే?
పుణేలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ మంటల్లో, పొగలు కక్కుతూ కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియోను ఆటో కార్ ఎడిటర్ హర్మబ్ద్ సొరబ్జీ షేర్ చేస్తూ.. ఈ ఘటనపై వివరణ కోరుతూ ఓలా ఎలక్ట్రిక్‌ను ట్యాగ్ చేశారు.
అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. దీనితో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చాలా మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపఫథ్యంలో వెంటనే అప్రమత్తమైన ఓలా ఎలక్ట్రిక్ అధినేత భవీశ్ అగర్వాల్.. ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 'వినియోగదారుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుంద'ని పేర్కొన్నారు.
ఇక ఓలా ఎలక్ట్రిక్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేసింది.. 'పుణేలో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. ఘటనకు అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం. మా వాహనాల భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తాం. మా ఉత్పత్తుల్లో క్వాలిటీకే అధిక ప్రాధన్యత ఉటుంది. పుణె ఘటనపై చర్చలు తీసుకుంటాం' అని పేర్కొంది.
ఇక పుణేలో మంటల్లో కాలిపోయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఓనర్‌తో మాట్లాడినట్లు తెలిపింది కంపెనీ. ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించుకున్నట్లు వివిరించింది. ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు ప్రారంభించినప్పటి నుంచి పలు సాంకేతిక సమస్యలు వచ్చినా.. మంటలు చెలరేగటం మాత్రం ఇదే ప్రథమమని తెలుస్తోంది.
Also read: SBI Alert: ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్- ఈ రెండు రోజులు సేవలకు అంతరాయం!
Also read: Petrol Diesel Prices Hike: ఆగని పెట్రో మంట.. ఆరు రోజుల్లో ఇది ఐదోసారి! ఈరోజు ఎంత పెరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook