Ola, Uber auto fares: ఓలా, ఉబర్ కస్టమర్స్‌కి షాకింగ్ న్యూస్
GST on Ola, Uber auto fares: ఓలా, ఉబర్‌పై ఎక్కువగా ఆధారపడుతూ వివిధ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించే వారికి ఇదొక బ్యాడ్ న్యూస్. ఓలా, ఉబర్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే ఆటో రైడ్స్‌పై 5 శాతం జిఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయించింది. 2022 జనవరి 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.
GST on Ola, Uber auto fares: ఓలా, ఉబర్‌పై ఎక్కువగా ఆధారపడుతూ వివిధ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించే వారికి ఇదొక బ్యాడ్ న్యూస్. ఓలా, ఉబర్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే ఆటో రైడ్స్‌పై 5 శాతం జిఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయించింది. 2022 జనవరి 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఓలా ఆటోలు, ఉబర్ ఆటోలు చార్జీలు ఇంకొంత మేర పెరగనున్నాయి.
ఇదే విషయమై ఉబర్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఆటోల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న కేంద్రం నిర్ణయం సమర్ధించదగినదే అయినప్పటికీ.. ఈ నిర్ణయం ఆటో డ్రైవర్ల ఆదాయం (Auto drivers on GST) పడిపోయేలా చేయడంతో పాటు కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డిజిటైజేషన్ కార్యక్రమంపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.
రైడర్ల సంక్షేమం, డ్రైవర్ల సంక్షేమంతో పాటు నగరాల్లో రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఓలా, ఉబర్ ఆటోలపై జిఎస్టీని మినహాయించాలని ఉబర్ (Uber on GST on auto fares) తమ అధికారిక ప్రకటనలో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
Also read : Rape on 10th class girl: పదో తరగతి బాలికపై క్లాస్‌మేట్ అత్యాచారం... గర్భం దాల్చిన బాలిక
ర్యాపిడో సహవ్యవస్థాపకుడు అరవింద్ సంక (Aravind Sanka) మీడియాతో మాట్లాడుతూ.. మొబైల్ యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆటోలపై జీఎస్టీ విధింపునకు ఇంకెంతో వ్యవధి లేనందున వీలైనంత త్వరగా కేంద్రం ఈ నిర్ణయంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని.. లేదంటే ఈ రంగంపైనే ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉందని తెలిపారు.
ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎన్ రఘు ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ... ఓలా, ఉబర్ ఆటోలపై జీఎస్టీ (GST on Ola, Uber autos) వడ్డింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే కరోనావైరస్ కారణంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా ఎంతో చితికిపోయాయని, కేంద్రం నిర్ణయం మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా తయారైందని రఘు ఆవేదన వ్యక్తంచేశారు.
Also read : రోజుకు కేవలం రూ.20 పొదుపు చేస్తే చాలు... రూ.1.88 కోట్లు పొందవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook