Old vs New Pension Scheme: ఓల్డ్ అండ్ న్యూ పెన్షన్ పథకాల మధ్యం అంతరం తెలుసుకోండి
Old vs New Pension Scheme: ప్రస్తుతం వాడుకలో ఉన్న రెండు రకాల పెన్షన్ పథకాలపై చర్చ జరుగుతోంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ రెండింటికీ ఉన్న తేడా ఏంటి, ఒకదానికి మరొకటి ఏ విధంగా విభిన్నమైందనే వవరాలు తెలుసుకుందాం..
ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ విషయంలో కొద్దిగా వివాదం నడుస్తోంది. పెన్షనర్లు ఈ రెండు పెన్షన్ స్కీములపై చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. అందుకే ఈ రెండు పెన్షన్ స్కీముల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రెండు పెన్షన్ పథకాలు ఏ విధంగా ఒకదానికొకటి విభిన్నమైనవో తెలుసుకుందాం.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్
పాత పెన్షన్ పథకం లేదా ఓపీఎస్ అనేది ఒక రిటైర్మెంట్ పథకం. దీనిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. పాత పెన్షన్ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు లాస్ట్ డ్రాన్ జీతం ఆధారంగా పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం కింద లబ్దిదారులకు వారి సర్వీస్ జీవితం చివరి వరకూ పెన్షన్ లభిస్తుంది. ఆ వ్యక్తి తీసుకున్న చివరి జీతంలో సగం మొత్తం నెలవారీ పెన్షన్‌లా అందుతుంది.
కొత్త పెన్షన్ పథకం
ఎన్‌పీఎస్ అనేది ఒక రిటైర్మెంట్ పథకం. ఇందులో లబ్దిదారులు రిటైర్మెంట్ అనంతరం ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 60 శాతం తీయవచ్చు. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2004లో ప్రారంభించింది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని నెలవారీ పెన్షన్ కింద పొందడానికి ఏడాదికి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే రిటైర్మెంట్ తరువాత 60 శాతం ఒకేసారిగా, 40 శాతం నెలవారీ పెన్షన్ కింద పొందేందుకు పెట్టుబడి పెట్టవచ్చు.
ట్యాక్స్ మినహాయింపు
పాత పెన్షన్ పథకంలో ఏ విధమైన ట్యాక్స్ మినహాయింపు లేదు. అదే కొత్త పెన్షన్ పథకంలో సిబ్బందికి ఇన్‌కంటాక్స్ శాఖ చట్టం సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షలు, 80 సీసీడీ బీ1 ప్రకారం ఇతర పెట్టుబడులపై 50 వేల రూపాయలవరకూ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook